Movie News: శ్రీ సింహా చేస్తున్న తప్పు అదేనా?

Movie News: శ్రీ సింహా చేస్తున్న తప్పు అదేనా?

Arun Chilukuri
Updated on: 6 Oct 2022 9:30 PM IST
Is Keeravani Son Sri Simha Making Mistakes
X

Movie News: శ్రీ సింహా చేస్తున్న తప్పు అదేనా?

Movie News: రాజమౌళి కుటుంబం నుంచి ప్రముఖ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి తనయుడిగా శ్రీ సింహా కోడూరి ఇండస్ట్రీకి హీరోగా "మత్తు వదలరా" అనే సినిమాతో పరిచయం అయ్యారు. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న శ్రీ సింహా ఆ తర్వాత "తెల్లవారితే గురువారం" అనే సినిమాతో పర్వాలేదనిపించారు. ఇక తాజాగా శ్రీ సింహా నటించిన "దొంగలున్నారు జాగ్రత్త" బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. అయితే మరొకవైపు శ్రీ సింహా చేతిలో బోలెడు ప్రాజెక్టులు ఉన్నట్టు సమాచారం.

ప్రస్తుతం "ఉస్తాద్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న శ్రీ సింహా ఈ మధ్యనే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఇక శ్రీ సింహా చేతిలో మరొక సినిమా కూడా ఉంది కానీ అభిమానులు మాత్రం చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నాయి అనే దానికంటే చేసేవి ఒకటి రెండు సినిమాలే అయినా అవి ఎలా ఉన్నాయి అనేది మాత్రమే ముఖ్యమని కామెంట్లు చేస్తున్నారు.

సందీప్ కిషన్, ఆది సాయికుమార్ వంటి హీరోలు కూడా కెరియర్ మొదట్లో మంచి హిట్ సినిమాలు అందుకున్నప్పటికీ ఎక్కువ సినిమాలు చేయాలి అనే తపనతో మంచి స్క్రిప్టులను చేజిక్కించుకోలేక వరుస డిజాస్టర్ల పాలయ్యారు. దీంతో వారి మార్కెట్ కూడా బాగానే పడిపోయింది. ఇక వీళ్ళ దారిలోనే శ్రీ సింహా కూడా వెళుతున్నాడా అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇకనైనా శ్రీ సింహా తొందరపడి సినిమాలు సైన్ చేయకుండా మంచి కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటే హీరోగా నిలదొక్కుకోగలడని ట్రేడ్ వర్గాలు సైతం అభిప్రాయపడుతున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story