Pawan Kalyan: హరిహరవీరమల్లు నుంచి తప్పుకుంటున్న క్రిష్..??

*హరిహరవీరమల్లు నుంచి దర్శకుడు క్రిష్ తప్పుకుంటున్నారా..?? మరో ప్రాజెక్ట్ కోసం బాలీవుడ్ హీరోతో క్రిష్ సంప్రదింపులు జరుపుతున్నారా..?? టాలీవుడ్ వర్గాలు ఔననే అంటున్నాయి. పవన్ తీరుతో విసుగు చెందిన క్రిష్ ఇక చేసేది లేక తన ఫోకస్ ను వేరే ప్రాజెక్ట్ పైకి మళ్లించాడంటున్నారు.

Jyothi
Published on: 21 May 2023 8:29 AM IST
Is Director Krish leaving  Hari Hara Veera Mallu??
X

Pawan Kalyan: హరిహరవీరమల్లు నుంచి తప్పుకుంటున్న క్రిష్..??

Pawan Kalyan: హరిహరవీరమల్లు నుంచి దర్శకుడు క్రిష్ తప్పుకుంటున్నారా..?? మరో ప్రాజెక్ట్ కోసం బాలీవుడ్ హీరోతో క్రిష్ సంప్రదింపులు జరుపుతున్నారా..?? టాలీవుడ్ వర్గాలు ఔననే అంటున్నాయి. పవన్ తీరుతో విసుగు చెందిన క్రిష్ ఇక చేసేది లేక తన ఫోకస్ ను వేరే ప్రాజెక్ట్ పైకి మళ్లించాడంటున్నారు.

హరిహరవీరమల్లు నుంచి దర్శకుడు క్రిష్ తప్పుకుంటున్నారా..?? మరో ప్రాజెక్ట్ కోసం బాలీవుడ్ హీరోతో క్రిష్ సంప్రదింపులు జరుపుతున్నారా..?? టాలీవుడ్ వర్గాలు ఔననే అంటున్నాయి. పవన్ తీరుతో విసుగు చెందిన క్రిష్ ఇక చేసేది లేక తన ఫోకస్ ను వేరే ప్రాజెక్ట్ పైకి మళ్లించాడంటున్నారు. పవన్ వెంటనే కలుగజేసుకోకపోతే హరిహరవీరమల్లు వెలుగు చూడడం కష్టమే అంటున్నారు..

పవన్ కల్యాణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రారంభించిన చిత్రం హరిహరవీరమల్లు. ఈ చిత్రం వకీల్ సాబ్ సినిమా షూటింగ్ సమయంలో ప్రారంభం అయింది. వకీల్ సాబ్ రావడం బాక్సాఫీస్ దగ్గర హిట్టు కొట్టడం పూర్తయింది కానీ హరిహరవీరమల్లు మాత్రం షూటింగ్ దశలోనే ఉండిపోయింది. హరిహరవీరమల్లు షూటింగ్ ఆలస్యం కావడానికి కరోనా ఒక కారణం అయితే పవన్ ఈ చిత్రాన్ని కాదని వేరే సినిమాలకు ప్రాధాన్యం ఇవ్వడం కూడా ఒక రీజనే...

కరోనా లాక్ డౌన్ ఎత్తివేయగానే పవన్ కల్యాణ్ తన డేట్స్ ను భీమ్లా నాయక్ సినిమాకి ఇచ్చారు. ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకున్న పవన్...హరిహరవీరమల్లు షూటింగ్ ని తిరిగి ప్రారంభించారు. దీంతో పవర్ స్టార్ అభిమానులతో పాటు క్రిష్ సైతం సంబరపడ్డారు. అయితే రెండు నెలలు విరామం లేకుండా షూటింగ్ లో పాల్గొన్న పవన్..ఆ తర్వాత హరిహరవీరమల్లుకి బ్రేక్ ఇచ్చేశారు.

హరిహరవీరమల్లును పక్కన పెట్టి పవన్ బ్రో మూవీ షూటింగ్ చేశారు. ఆ తర్వాత చిన్నపాటి గ్యాప్ తీసుకొని ఉస్తాద్ భగత్ సింగ్ ని లైన్ లోకి తెచ్చారు. ఈ మూవీ షూటింగ్ మొదటి షెడ్యూల్ ను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేశారు. ఈ షెడ్యూల్ పూర్తి కాగానే సుజిత్ కాంబినేషన్ లో చేస్తున్న OG పై ఫోకస్ పెట్టారు. సుమారు నెల రోజుల వరకు సాగిన ఈ షెడ్యూల్ తర్వాత హరిహరవీరమల్లు చిత్రానికి పవన్ తన డేట్స్ ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ, అలా కాకుండా మళ్లీ OG చిత్రానికే పవన్ డేట్స్ ఇచ్చేశారు. దీని తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ కోసం తన కాల్ షీట్స్ ఇవ్వనున్నారు పవన్.

ఇలా ఎప్పుడో ప్రారంభించిన హరిహరవీరమల్లును కాదని పవన్ బ్రో, ఉస్తాద్ భగత్ సింగ్, OG చిత్రాలకే ప్రాధాన్యం ఇవ్వడంపై దర్శకుడు జాగర్లమూడి క్రిష్ చాలా అప్ సెట్ అయ్యారట. దీంతో తన ఫోకస్ ను వేరే ప్రాజెక్ట్ పైకి షిఫ్ట్ చేసే ఆలోచనలో క్రిష్ ఉన్నారని టాలీవుడ్ ఇన్ సైడర్స్ చెబుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరోతో సంప్రదింపులు కూడా జరిపారంటున్నారు. మరి, హరిహరవీరమల్లు షూటింగ్ మొత్తం పూర్తయింది..కేవలం క్లైమాక్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఈ బ్యాలెన్స్ పార్ట్ ని పూర్తి చేసి తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కి క్రిష్ షిప్ట్ అవుతారా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది. మరి, వచ్చే నెలలో హరిహరవీరమల్లు చిత్రానికి డేట్స్ ఇచ్చి...క్రిష్ నే కాదు తన ఫ్యాన్స్ ను సైతం పవన్ ఖుషీ చేస్తాడేమో చూడాలి.

Jyothi

Jyothi

Next Story