Balakrishna: బాలయ్య 110 వ సినిమా అదేనా?

Balakrishna: నందమూరి బాలకృష్ణ ప్రముఖ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకి వచ్చిన సినిమా "ఆదిత్య 369".

Arun Chilukuri
Published on: 7 Aug 2022 6:08 PM IST
Is Balakrishna Going to Make his 110th Film Under the Direction of Singeetam Srinivasa Rao
X

Balakrishna: బాలయ్య 110 వ సినిమా అదేనా?

Balakrishna: నందమూరి బాలకృష్ణ ప్రముఖ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకి వచ్చిన సినిమా "ఆదిత్య 369". అప్పట్లో ఆ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లోని క్లాసిక్ సినిమాలలో ఒకటిగా నిలిచిన ఈ సినిమాకి సీక్వెల్ ఇప్పుడు రాబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

మరి "ఆదిత్య 369" సినిమాకి దర్శకత్వం వహించిన సింగీతం శ్రీనివాస్ రావు ఈ సినిమాకి కూడా దర్శకత్వం వహిస్తారా? కానీ ఆయనకు ఇప్పుడు 90 ఏళ్లు. మరి ఈ వయసులో ఈ సినిమా సాధ్యమేనా? అంటూ సందేహాలు కూడా రేకెత్తున్నాయి. 2013లో "వెల్కమ్ ఒబామా" అనే సినిమాకి చేసిన సింగీతం శ్రీనివాసరావు ఆ తర్వాత మళ్లీ మెగా ఫోన్ పట్టుకోలేదు.

ప్రస్తుతం స్క్రిప్ట్ సిద్ధం చేయగలిగిన స్థితిలో ఉన్నప్పటికీ దానిని స్వయంగా తెరపైకి తీసుకురావడం అంతా సులభం కాదు. పైగా ప్రేక్షకులకు నచ్చే విధంగా సినిమాలో టెక్నికల్ గా కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సాంకేతిక విషయాలపై కూడా చాలా పట్టు ఉండాలి. కానీ శ్రీనివాసరావు వయసు ఆయనకు ఇప్పుడు పెద్ద అడ్డంకిగా మారే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. మరెవరైనా డైరెక్టర్ అయితే సినిమాకి న్యాయం చేయగలరా లేదా అనే డౌట్లు కూడా వస్తున్నాయి. ఒకవేళ అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా బాలయ్య కెరియర్ లో 110వ సినిమా కాబోతోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story