Allu Aravind: అల్లు అరవింద్ ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ అంటున్న ఫ్యాన్స్..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో ఇప్పుడు కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి.

Arun Chilukuri
Updated on: 31 Jan 2023 8:30 PM IST
Is Allu Aravind Also Investing for Pawan Kalyans OG Film
X

అల్లు అరవింద్ ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ అంటున్న ఫ్యాన్స్..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో ఇప్పుడు కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి. "హరిహర వీరమల్లు" సినిమా షూటింగ్ తోనే బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో "ఉస్తాద్ భగత్ సింగ్" సినిమాలో కూడా నటించనున్నారు. తమిళ్ సూపర్ హిట్ సినిమా "వినోదయ సితం" సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్న పవన్ కళ్యాణ్ "సాహో" ఫేమ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో కూడా ఒక సినిమాని సైన్ చేశారు. ఈ సినిమాకి "దే కాల్ హిం ఓజీ" అనే ఒక ఆసక్తికరమైన టైటిల్ ను ఖరారు చేశారు దర్శక నిర్మాతలు.

అయితే ఈ సినిమా "కేజిఎఫ్", "పఠాన్" వంటి ప్యాన్ ఇండియా సినిమాల కంటే నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతోంది అని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా. "ఆర్ఆర్ఆర్" బ్యానర్ డివివి ఎంటర్టైన్మెంట్ పతాకం పై డివివి దానయ్య ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. "సాహో" లాగా ఈ సినిమా కూడా యాక్షన్ ఫీస్ట్ గా ఉంటుందని, అదిరిపోయే విజువల్ ఎఫెక్ట్స్ మరియు భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది అని తెలుస్తోంది.

అయితే తాజా సమాచారం ప్రకారం గీత ఆర్ట్స్ తరఫునుంచి అల్లు అరవింద్ కూడా ఈ సినిమాని నిర్మించడానికి చేతులు కలపబోతున్నట్లు తెలుస్తోంది. అల్లు అరవింద్ కూడా ఈ సినిమాకి సీక్రెట్ ఇన్వెస్టర్ గా మారబోతున్నారట. అల్లు స్టూడియోస్ లోనే సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా జరగబోతుందని టాక్ వినిపిస్తోంది. ఈ మధ్యనే సినిమా ముహూర్తం ఈవెంట్ లో కూడా అల్లు అరవింద్ పాలుపంచుకున్నారు. ఈ నేపథ్యంలో అల్లు అరవింద్ ను టాలీవుడ్ ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ అని అందుకే ఇలాంటి భారీ బడ్జెట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నారు అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story