Kantara: అభిమానులకు గుడ్ న్యూస్.. కాంతార సీక్వెల్ లో జూ.ఎన్టీఆర్

Kantara: అభిమానులకు గుడ్ న్యూస్.. కాంతార సీక్వెల్ లో జూ.ఎన్టీఆర్
x

Kantara: అభిమానులకు గుడ్ న్యూస్.. కాంతార సీక్వెల్ లో జూ.ఎన్టీఆర్

Highlights

Kantara: కాంతార సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాకు ప్రీక్వెల్ ఉంటుందని ప్రకటించగా కాంతార: చాప్టర్ 1 షూటింగ్ కూడా పూర్తయి, అక్టోబర్ 2న విడుదల కానుంది.

Kantara: కాంతార సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాకు ప్రీక్వెల్ ఉంటుందని ప్రకటించగా కాంతార: చాప్టర్ 1 షూటింగ్ కూడా పూర్తయి, అక్టోబర్ 2న విడుదల కానుంది. అయితే, ఇప్పుడు అంతకంటే పెద్ద అప్‌డేట్ ఒకటి బయటకు వచ్చింది. కాంతారకు ప్రీక్వెల్ మాత్రమే కాదు, ఒక సీక్వెల్ కూడా రాబోతోందని వార్తలు వస్తున్నాయి. ఆ సీక్వెల్‌లో టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ నటించనున్నారని సమాచారం.

బ్లాక్‌బస్టర్ హిట్ అయిన కాంతార సినిమాకు ప్రీక్వెల్ అయిన కాంతార: చాప్టర్ 1 కథతో సినిమా ముగియదని, దీనికి కొనసాగింపుగా కాంతార: చాప్టర్ 2 కూడా రాబోతోందని పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ సీక్వెల్‌లోనే టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కీలక పాత్రలో నటించనున్నారని సమాచారం. జూనియర్ ఎన్టీఆర్, కాంతార డైరెక్టర్ రిషబ్ శెట్టిల మధ్య మంచి స్నేహం ఉంది. ఇది ఈ వార్తలకు మరింత బలం చేకూర్చుతోంది. గతంలో జూనియర్ ఎన్టీఆర్ తన తల్లితో కలిసి కర్ణాటకలోని కుందాపూర్‌కు వెళ్లినప్పుడు, ఈ సినిమా గురించి చర్చలు జరిగాయని ఊహాగానాలు వచ్చాయి. అయితే, దీనిపై ఇప్పటివరకు సినిమా యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ సీక్వెల్‌లో మోహన్‌లాల్ కూడా నటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

ఆర్‌ఆర్‌ఆర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ పాన్-ఇండియా స్టార్‌గా ఎదిగారు. ప్రస్తుతం ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. అలాగే, వార్ 2తో హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. ఆయన కన్నడలో పాట కూడా పాడారు. ఒకవేళ ఆయన కన్నడ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తే, అది ఒక పెద్ద సంచలనం అవుతుంది. కాంతార వంటి విజయవంతమైన ఫ్రాంఛైజీలో ఆయన భాగమైతే అది సినిమా రేంజ్‌ను మరింత పెంచుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories