బద్రి, పోకిరి, చిరుత.. వీటికి ముందుగా పూరీ పెట్టిన టైటిల్స్ ఏంటో తెలుసా?

బద్రి, పోకిరి, చిరుత.. వీటికి ముందుగా పూరీ పెట్టిన టైటిల్స్ ఏంటో తెలుసా?
x

puri Jagannadh 

Highlights

Puri Jagannadh Titles : పూరీ జగన్నాథ్.. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్.. ఒక సినిమాని ఎప్పుడు స్టార్ట్ చేస్తాడో.. ఎప్పుడు ముగిస్తాడో.. ఎప్పుడు రిలీజ్ చేస్తాడో తెలియదు.. కొడితే సినిమా బ్లాక్ బస్టర్ అవ్వుద్ది.. పూరీ అనగానే ఒకటిగా ఫాస్ట్ గా సినిమాలు తీయడం

Puri Jagannadh Titles : పూరీ జగన్నాథ్.. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్.. ఒక సినిమాని ఎప్పుడు స్టార్ట్ చేస్తాడో.. ఎప్పుడు ముగిస్తాడో.. ఎప్పుడు రిలీజ్ చేస్తాడో తెలియదు.. కొడితే సినిమా బ్లాక్ బస్టర్ అవ్వుద్ది.. పూరీ అనగానే ఒకటిగా ఫాస్ట్ గా సినిమాలు తీయడం అయితే ఇంకోటి టైటిల్స్.. అప్పటివరకు సాఫ్ట్ టైటిల్స్ తో పోతున్నా ఇండస్ట్రీకి తిట్లను టైటిల్స్ గా పెట్టి ట్రెండ్ సెట్ చేశాడు పూరీ.. దీనితో ఆయన పెట్టే టైటిల్స్‌కి ప్రేక్షకుల్లో బాగా ఆసక్తిని పెంచాయి. అయితే ముందుగా కొన్ని సినిమాలకి పూరీ అనుకున్న టైటిల్స్ వేరు.. తెరపైకి వచ్చాక వచ్చిన టైటిల్స్ వేరు అయ్యాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

1. పూరీ జగన్నాథ్ ఫస్ట్ మూవీ బద్రి.. పవన్‌కల్యాణ్‌, రేణూ దేశాయ్‌, అమీషా పటేల్‌ హీరో హీరోయిన్ లుగా ఈ చిత్రం 2000 సంవత్సరంలో తెరకెక్కింది.. అయితే ముందుగా ఈ సినిమాకి 'చెలి' అనే టైటిల్ ని అనుకున్నారు.. టైటిల్ మరి క్లాస్ గా ఉందని పూరీ ఫ్రెండ్స్ చెప్పడంతో 'బద్రి' గా టైటిల్‌ మార్చారు!

2. హీరోగా రవితేజకి మంచి బ్రేక్ ఇచ్చిన చిత్రం 'ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం'. క్లాసిక్ లవ్ స్టొరీగా వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి మొదట 'జీవితం' అనే టైటిల్ అనుకున్నాడు పూరీ.. ఆ తరవాత ఇట్లు శ్రావణి సుబ్రమణ్యంగా మార్చేశాడు..

3. సింహాద్రి లాంటి భారీ సక్సెస్ తర్వాత పూరీ జగన్నాథ్ తో సినిమాని చేశాడు ఎన్టీఆర్.. అదే 'ఆంధ్రావాలా'... కానీ ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ముందుగా ఈ సినిమాకి 'కబ్జా' అనే టైటిల్ ని అనుకున్నాడు..

4. ఇక పూరీ జగన్నాథ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన 'పోకిరి' సినిమాకి ముందుగా 'ఉత్తమ్‌ సింగ్‌' అనే టైటిల్‌ అనుకున్నారు. అయితే మహేష్ టైటిల్ మార్చమని చెప్పడంతో పోకిరిగా మార్చారు.

5. మెగా తనయుడు రామ్ చరణ్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా 'చిరుత'.. `దీనికి ముందుగా 'కుర్రాడు' అనే టైటిల్ లో క్లాస్‌ ఏరియా' ఉపశీర్షికను అనుకున్నాడు పూరీ.. ఆ తర్వాత చరణ్ ఎంట్రీ సినిమా కావడంతో చిరుతగా మార్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories