ఓజీ వచ్చేశాడు.. పవన్ ఫ్యాన్స్ కి ఇక పూనకాలే..!

Pawan Kalyan: "ఓ జీ" షూటింగ్ సెట్స్ లో చేరిన పవన్ కళ్యాణ్

Jyothi
Updated on: 18 April 2023 8:30 PM IST
Interesting update about the Shooting of Pawan Kalyan Movie OG
X

పవన్ కళ్యాణ్ "ఓ జీ" సినిమా షూటింగ్ గురించి అదిరిపోయే అప్డేట్

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు చేతి నిండుగా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఒకవైపు రాజకీయ పనులను చూసుకుంటూ మరోవైపు సినిమా కమిట్మెంట్లను కూడా పూర్తి చేయడానికి బాగానే ప్రయత్నాలు చేస్తున్నారు పవన్. ఈమధ్యనే "సాహో" ఫేమ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో కూడా పవన్ కళ్యాణ్ ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. "ఓజీ" అనే ఆసక్తికరమైన టైటిల్ తో ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక గ్యాంగ్ స్టార్ పాత్రలో కనిపించబోతున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ మధ్యనే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టింది చిత్ర బృందం. సినిమాలో కీలక పాత్ర లు పోషిస్తున్న నటీనటులతో పాటు పవన్ కళ్యాణ్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. సినిమా షూటింగ్ చాలా వరకు ముంబై లోనే జరుగుతుంది. యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా షూటింగ్ గత వారమే సెట్స్ మీదకి వెళ్ళింది. ఇక టైటిల్ కూడా చాలా కొత్తగా ఉండడంతో సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర ఇంకెలా ఉంటుందో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. పైగా చాలా వరకు తన సినిమా షూటింగ్లను హైదరాబాదులోనే జరిపే పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం ముంబై దాకా వెళ్లారు.

తాజాగా ఈ సినిమా కోసం హీరోయిన్ గా ప్రియాంక అరుల్ మోహన్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ఈ సినిమా ను నిర్మిస్తున్నారు. తెలుగు లో మాత్రమే కాక హిందీ, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో ప్యాన్ ఇండియన్ స్థాయిలో ఈ సినిమా విడుదల కానుంది. వరుస షూటింగ్ షెడ్యూల్స్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా 6 నెలల్లో సినిమాను పూర్తి చేసి ఈ ఏడాది చివర్లో సినిమాను విడుదల చేయాలని చిత్ర బృందం ప్రయత్నాలు చేస్తోంది.

Jyothi

Jyothi

Next Story