రామ్ చరణ్ శంకర్ సినిమా గురించిన ఆసక్తికరమైన అప్డేట్

Interesting update about Ram Charan Shankar movie
x

రామ్ చరణ్ శంకర్ సినిమా గురించిన ఆసక్తికరమైన అప్డేట్

Highlights

Ram Charan Movie Update: రామ్ చరణ్ సినిమా లో ఒక్క సన్నివేశానికి అన్ని కోట్లా

Ram Charan Movie Update: ఈ మధ్యనే "ఆర్ఆర్ఆర్" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ "ఆచార్య" సినిమా తో డిజాస్టర్ అందుకున్నారు. తాజాగా ఇప్పుడు స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా చేయబోతున్నారు. #ఆర్సీ15 అనే టైటిల్ తో ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. రాంచరణ్ కరియర్ లో 15వ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రాబోతున్న 50వ ప్రాజెక్ట్ కూడా.

అయితే ఈ సినిమాలోని ఒక స్పెషల్ సాంగ్ కోసం దర్శక నిర్మాతలు భారీగా ఖర్చుపెట్టారని వార్తలు వినిపిస్తున్నాయి. అలానే శంకర్ ఈ సినిమాలో ఒక హై వోల్టేజ్ యాక్షన్ సీన్ ను కూడా ప్లాన్ చేశారట. కేవలం ఈ ఒక్క సన్నివేశం కోసమే నిర్మాతలు 10 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ జరగబోతోంది. దాదాపు 1000 మంది ఫైటర్లు ఈ సన్నివేశంలో పాల్గొనబోతున్నారు. ఇక ఈ సన్నివేశం సినిమాకి హైలైట్ గా మారుతుందని సమాచారం. అంజలి, శ్రీకాంత్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories