Game Changer: "గేమ్ చేంజర్" సినిమా షూటింగ్ గురించిన ఆసక్తికరమైన అప్డేట్..

Game Changer: "గేమ్ చేంజర్" షూటింగ్ ఇంకా ఎంత పెండింగ్ ఉందో తెలుసా..

Dhatripriya
Updated on: 20 April 2023 9:31 PM IST
Interesting Update About Game Changer Movie
X

Game Changer: "గేమ్ చేంజర్" సినిమా షూటింగ్ గురించిన ఆసక్తికరమైన అప్డేట్..

Game Changer: "ఆర్ఆర్ఆర్" సినిమా సూపర్ సక్సెస్ తో ఇప్పుడు ఎక్కడ చూసినా రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ల పేర్లు తెగ వినిపిస్తున్నాయి. కేవలం తెలుగు రాష్ట్రాల ప్రజలు మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా అభిమానులు అందరూ వీరి నెక్స్ట్ సినిమాల గురించి చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. #ఆర్సి15 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ఈ మధ్యనే గేమ్ చేంజర్ అనే ఆసక్తికరమైన టైటిల్ ఖరారు చేశారు దర్శకనిర్మాతలు.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయింది. తాజాగా ఈ సినిమా షూటింగ్ కి సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ ను ఈ మధ్యనే చిత్ర బృందం బయటపెట్టింది. తాజా సమాచారం ప్రకారం "గేమ్ చేంజర్" సినిమా కోసం కేవలం 60 రోజుల షూటింగ్ మాత్రమే పెండింగ్ ఉందట. అంటే దాదాపు రెండు నెలల పాటు షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. త్వరగా షూటింగ్ ను పూర్తి చేసి సినిమాని విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.

బాలీవుడ్ బ్యూటీ కియార ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. "వినయ విధేయ రామ" సినిమా తర్వాత కియార రామ్ చరణ్ సరసన నటిస్తున్న రెండవ సినిమా ఇది. ఎస్ జే సూర్య, జయరాం, సునీల్, శ్రీకాంత్, నవీన్ చంద్ర, నాజర్, రాజీవ్ కనకాల తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story