Pawan - Harish Shankar : హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్ ఇదేనట

* ఆసక్తికరమైన టైటిల్ తో రాబోతున్న పవన్ కళ్యాణ్

admin1
Updated on: 9 Oct 2021 11:53 AM IST
Interesting Title of Pawan Kalyan and Harish Shankar Upcoming Movie
X

పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ (ట్విట్టర్ ఫోటో)

Pawan Kalyan - Harish Shankar: ఈ మధ్యనే "వకీల్ సాబ్" వంటి సూపర్ హిట్ సినిమాతో మంచి కంబ్యాక్ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో ఇప్పుడు చాలానే ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో "హరిహర వీరమల్లు" సినిమాతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ మరోవైపు మలయాళంలో సూపర్ హిట్ అయిన "అయ్యప్పనుమ్ కోషియుమ్" రీమేక్ సినిమాతో కూడా బిజీగా ఉన్నారు. తర్వాత పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. "గబ్బర్ సింగ్" వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రెండవ సినిమా ఇది.

తాజాగా ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాకు "భవదీయుడు భగత్ సింగ్" అనే ఒక ఆసక్తికరమైన టైటిల్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడాల్సి ఉంది. టైటిల్ ని బట్టి చూస్తే ఈ సినిమా పీరియడ్ బ్యాక్ డ్రాప్తో సాగే అవకాశాలు ఉన్నాయని పుకార్లు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ చిత్ర షూటింగ్ అతి తొందరలో సెట్స్ పైకి వెళ్లబోతోంది. అయనంక బోస్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న ఈ సినిమాకి ఆనంద్ సాయి ఆర్ట్ డైరెక్టర్గా పని చేయనున్నారు.

admin1

admin1

Next Story