Mahesh Babu: ఆసక్తికర టైటిల్ తో రానున్న #SSMB28 సినిమా?

Interesting title in consideration for #SSMB28
x

#SSMB28

Highlights

Mahesh Babu: మహేష్ బాబు ఈ చిత్రంలో రా ఏజెంట్ పాత్రను పోషించబోతున్నారని వార్తలు

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు.. అతడు, ఖలేజా సినిమాల తరువాత దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో మూడో సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. అభిమానులు ఈ ప్రాజెక్ట్ గురించి ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.

మహేష్ బాబు ఈ చిత్రంలో రా ఏజెంట్ పాత్రను పోషించబోతున్నారని వార్తలు కూడా వినిపించాయి. దీంతో ఈ సినిమాపై అంచనాలను భారీగా పెరిగాయి. ప్రస్తుతం, ఈ చిత్రం కోసం ఒక ఆసక్తికరమైన టైటిల్ పరిశీలనలో ఉందంట. తాజా సమాచారం ప్రకారం త్రివిక్రమ్ #SSMB28 కి 'పార్దు' అనే టైటిట్ పెట్టనున్నారని తెలుస్తోంది. అతడు చిత్రంలో మహేష్ బాబు పాత్ర పేరు 'పార్దు'. అతడు సినిమా మహేష్ బాబు, త్రివిక్రమ్ కలయికలో వచ్చిన మొదటి సినిమా.

అతడు సినిమా టాలీవుడ్‌లో భారీ హిట్ సాధించింది. కాబట్టి, ఈ సినిమాలోని పాత్ర పేరునే #SSMB28 టైటిల్‌గా పెట్టాలని త్రివిక్రమ్ కోరుకుంటున్నట్లు తెలుస్తుంది. అధికారికంగా వెల్లడించే వరకు మనం ఆగాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories