Tuck Jagadish: జగపతి బాబు పాత్రలో నెగెటివ్ షేడ్స్..?

Interesting role for Jagapathi Babu in Nanis next
x

జగపతి బాబు, నాని (ఫొటో హాన్స్ ఇండియా)

Highlights

Tuck Jagadish: నాచురల్ స్టార్ నాని రాబోయే చిత్రం 'టక్ జగదీష్' టాలీవుడ్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి.

Tuck Jagadish: నాచురల్ స్టార్ నాని రాబోయే చిత్రం 'టక్ జగదీష్' టాలీవుడ్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి. ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నిన్ను కోరి' ఫేమ్ శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 2017 తరువాత నాని, శివ నిర్వాణాల కాంబినేషన్ లో వస్తున్న టక్ జగదీష్ పై టాలీవుడ్ అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇటీవల విడుదలైన 'టక్ జగదీష్' టీజర్ బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నారని విషయం తెలిసిందే.

తాజా నివేదికల ప్రకారం, జగపతి బాబు ఈ చిత్రంలో నాని అన్నయ్య పాత్రలో నటించబోతున్నారు. జగపతి బాబు పాత్రలో నెగటివ్ షేడ్స్ ఉండబోతున్నట్లు సమాచారం. అదే ఈ చిత్రంలో ట్విస్ట్ అని తెలుస్తోంది. ఈ చిత్రం ఏప్రిల్ 23 న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రంలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ కథానాయికలుగా నటిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories