Ravi Teja: రవితేజ "ధమాకా" డబుల్ ధమాకా కాబోతోందా?

Ravi Teja: రవితేజ సినిమా గురించి ఆసక్తికరమైన వార్తలు

Jyothi
Updated on: 26 Sept 2022 9:30 AM IST
Interesting News About Ravi Teja Movie
X

Ravi Teja: రవితేజ "ధమాకా" డబుల్ ధమాకా కాబోతోందా?

Ravi Teja: వరుస డిజాస్టర్లతో సతమతమవుతున్న మాస్ మహారాజా రవితేజ కి "క్రాక్" సినిమాతో మంచి హిట్ లభించింది. కానీ ఆ తర్వాత కూడా తన సినిమాలతో రవితేజ మెప్పించలేకపోయారు. ఈ మధ్యనే విడుదలైన "ఖిలాడి" సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద అంతంత మాత్రంగానే కలెక్షన్లు నమోదు చేసుకుంది. ఇక తాజాగా తన తదుపరి సినిమా "ధమాకా" పైనే తన ఆశలన్నీ పెట్టుకున్నారు రవితేజ. త్రినాథ్ రావు నక్కిన ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమాలో రవి తేజ పాత్ర గురించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

ఈ సినిమాలో రవి తేజ సింగిల్ రోలా లేక డబుల్ రోల్ పోషిస్తున్నారా అన్నది ఇప్పుడు ఇంటర్నెట్లో ఆసక్తికరంగా మారింది. గత కొద్ది రోజులుగా రవి తేజ సినిమా లో డబుల్ రోల్ పోషిస్తున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అదే నిజమయితే, సినిమా డబుల్ ధమాకా అవుతుంది అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కానీ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడాల్సి ఉంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై అభిషేక్ అగర్వాల్, టీ జీ విశ్వ ప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమ్స్ ఈ సినిమా కి సంగీతాన్ని అందిస్తున్నారు. జయరాం, సచిన్ ఖేడేకర్, రావు రమేష్, తనికెళ్ళ భరణి, అలి, హైపర్ ఆది తదితరులు ఈ సినిమా లో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story