Sankranti Movies: సంక్రాంతి సినిమాల ఇన్సైడ్ రిపోర్ట్ మామూలుగా లేదుగా..

* "వాల్తేరు వీరయ్య" మరియు "వీర సింహా రెడ్డి" సినిమాలో ఎలా ఉండబోతున్నాయి అంటే..

Dhatripriya
Updated on: 5 Jan 2023 9:30 PM IST
The Inside Report Of Sankranti Movies Is Not Usual
X

సంక్రాంతి సినిమాల ఇన్సైడ్ రిపోర్ట్ మామూలుగా లేదుగా

Sankranti Movies: ఈ సంవత్సరం కూడా సంక్రాంతి సినిమాలు త్వరలోనే విడుదలకు సిద్ధమవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి "వాల్తేరు వీరయ్య" మరియు నందమూరి బాలకృష్ణ "వీరసింహారెడ్డి" సినిమాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే వాల్తేరు వీరయ్య ఇన్సైడ్ రిపోర్ట్ చాలా పాజిటివ్గా వచ్చింది. ఫస్ట్ ఆఫ్ చాలా ఎంటర్టైనింగ్ గా సాగుతుందని సెకండ్ హాఫ్ లో ఎంటర్టైన్మెంట్ తో పాటు ఆక్షన్ కూడా ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

అంతేకాకుండా ఆ సినిమా మొత్తం మీద చిరంజీవి మరియు రవితేజ సన్నివేశాలు చాలా బాగా వచ్చాయని అవే సినిమాకి హైలైట్ అవుతాయని ఇంటర్వెల్ సన్నివేశం అదిరిపోతుందని తెలుస్తోంది. దీంతో సినిమాపై అంచనాలు రోజు రోజుకి పెరుగుతూ వస్తున్నాయి. మరోవైపు వీరసింహారెడ్డి ఇన్సైడ్ రిపోర్ట్ కూడా చాలా బాగా వచ్చింది. ఇది ఒక ఫుల్ ఫ్లెడ్జ్ మాస్ సినిమా అని మొదటి 45 నిమిషాలు సినిమా మొత్తం శృతిహాసన్ మరియు బాలకృష్ణల మధ్య లవ్ ట్రాక్ సాగుతుందని ఆ తరువాత సీనియర్ బాలకృష్ణ క్యారెక్టర్ ఎంట్రీ తో సినిమా మాస్ ఫీస్ట్ గా మారుతుందని సమాచారం.

ఇప్పటికే విడుదలైన చిత్ర టీజర్స్ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేశాయి. ఇలాంటి మాస్ క్యారెక్టర్ లో బాలకృష్ణను చూడాలని అభిమానులు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమాలో చాలా వరకు యాక్షన్ ఎపిసోడ్లు లేక్ బ్యాక్ డ్రాప్ తో ఉన్నాయని తెలుస్తోంది. ఆసక్తికరంగా ఈ రెండు సినిమాలలోను శృతిహాసన్ హీరోయిన్గా నటించగా రెండు సినిమాలను మైత్రి మూవీ మేకర్స్ వారే నిర్మించారు.

Dhatripriya

Dhatripriya

Next Story