ఈ తెలుగు హీరోలకు ఏమైంది .. శర్వానంద్ కి గాయాలు ..

ఈ తెలుగు హీరోలకు ఏమైంది .. శర్వానంద్ కి గాయాలు ..
x
Highlights

వరుసగా టాలీవుడ్ హీరోలు గాయాల బారిన పడుతున్నారు. ఇప్పటికే రామ్ చరణ్, ఎన్టీఆర్ , వరుణ్ తేజ్ షూటింగ్ సమయంలో గాయపడ్డారు .. నిన్నటికి నిన్న సందీప్ కిషన్...

వరుసగా టాలీవుడ్ హీరోలు గాయాల బారిన పడుతున్నారు. ఇప్పటికే రామ్ చరణ్, ఎన్టీఆర్ , వరుణ్ తేజ్ షూటింగ్ సమయంలో గాయపడ్డారు .. నిన్నటికి నిన్న సందీప్ కిషన్ గాయం బారిన పడ్డాడు .. అయితే తాజాగా ఈ లిస్టులో యంగ్ హీరో శర్వానంద్ కూడా చేరిపోయాడు .. ప్రస్తుతం శర్వానంద్ '96' అనే సినిమా చేస్తున్నాడు . సినిమా షూటింగ్ లో భాగంగా బ్యాంకాక్ లో జరుగుతున్న షెడ్యూల్ లో పాల్గొంటున్న శర్వానంద్, ఓ రిస్కీ షాట్ ను డూప్ లేకుండా చేస్తూ ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో అతనికి తీవ్రగాయాలు కాగా, యూనిట్ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. శర్వానంద్ భుజానికి, కాలికి గాయాలు అయినట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories