"ఆర్ఆర్ఆర్" సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేసిన రసూల్.. గే లవ్ స్టోరీ అంటూ ట్వీట్..

"ఆర్ ఆర్ ఆర్" సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేసిన రసూల్ పోకుట్టి

Rama Rao
Updated on: 5 July 2022 12:58 PM IST
Indian Sound Designer Resul Pookutty Comments On RRR Movie
X

 "ఆర్ ఆర్ ఆర్" సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేసిన రసూల్ పోకుట్టి 

Resul Pookutty: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకి వచ్చిన "ఆర్ఆర్ఆర్" సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్లు కలెక్షన్లు వసూలు చేసిన ఈ సినిమా టాలీవుడ్ లోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఎందరో సినీ ప్రముఖులు కూడా ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు.

కానీ తాజాగా రసూల్ పోకుట్టి ఈ సినిమాపై మండిపడుతున్నారు. ప్రముఖ సౌండ్ ఇంజనీర్ గా పేరు తెచ్చుకున్న రసూల్ ఈ సినిమాను విమర్శిస్తూ అభిమానులకు షాక్ ఇచ్చారు. "ఆర్ ఆర్ ఆర్" సినిమా గురించి మాట్లాడుతూ దాన్ని ఒక గే సినిమాగా పేర్కొని అభిమానుల మనోభావాలను దెబ్బతీశారు. అలాంటి సినిమాలు ఎక్కువగా చూడటం వల్ల ఏ సినిమాలు చూసినా రసూల్ కి అలానే అనిపిస్తుంది అంటూ అభిమానులు రసూల్ పై మండిపడుతున్నారు.

"వెస్టర్న్ దేశాల్లో అలాంటి సినిమాలని అలానే పిలుస్తారు, నేను దాన్ని అలానే కోట్ చేశాను," అని రసూల్ కప్పి పుచ్చుకోవడానికి ప్రయత్నించారు. నిజానికి అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ మరియు కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ ల మధ్య స్నేహం, వైరం మరియు బ్రోమాన్స్ ను రాజమౌళి చాలా అద్భుతంగా ఆవిష్కరించారు. వారి మధ్య ఉన్న స్నేహాన్ని కించపరుస్తూ అదొక గే సినిమా అని రసూల్ అనటం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Rama Rao

Rama Rao

Next Story