Tollywood: టాలీవుడ్ లో వారికి విలువలేదు అంటున్న ఎడిటర్

* "అందుకే సినిమా ఈవెంట్లకు దూరంగా ఉంటా" అంటున్న ప్రముఖ ఎడిటర్

admin1
Published on: 20 Sept 2021 4:06 PM IST
Indian Film Editor Marthand K. Venkatesh Comments on Tollywood Industry | Today Movie News
X

మార్తాండ్ కె వెంకటేష్ (ఫైల్ ఫోటో)

Tollywood Industry: టాలీవుడ్ సగం స్టార్ హీరో హీరోయిన్ల పైనే ఆధారపడి ఉందని అనటంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న స్టార్ హీరో హీరోయిన్లకు చాలా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సగం సినిమా కలెక్షన్లు వారివల్లే వస్తాయి అని చెప్పుకోవచ్చు. ఒక సినిమా సూపర్ హిట్ అయితే హీరో హీరోయిన్ తర్వాత దర్శకుడు సంగీత దర్శకుడు మాత్రమే క్రెడిట్ తీసుకుంటారు. సినిమా ఎవెంట్లలో కూడా సాంకేతిక నిపుణులకు క్రెడిట్ చాలా తక్కువ మంది ఇస్తారు. ఇదే విషయాన్ని ప్రముఖ ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ చెప్పుకొచ్చారు.

"మామూలుగానే నేను సినిమా ఈవెంట్లకు వెళ్లడానికి ఇష్టపడను. దానికి కారణం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో సాంకేతిక నిపుణుల కి విలువ ఉండదు. కేవలం అమీర్ ఖాన్ గారు వస్తున్నారు అన్నప్పుడు మాత్రమే నేను వెళ్ళాను. అది కూడా ఆయన నుంచి పాజిటివ్ వైబ్స్ కోసం" అని చెప్పుకొచ్చారు మార్తాండ్.కె.వెంకటేష్. ఆ ఇంటర్వ్యూ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అభిమానులందరూ ఆయన చెప్పిన దాంట్లో నిజం ఉంది అని అంటున్నారు.

admin1

admin1

Next Story