Bigg Boss 7: బిగ్‌బాస్‌ హౌస్‌లోకి టీమిండియా క్రికెటర్‌.. ఎవరో తెలుసా?

Indian Cricketer Venugopal Rao in Telugu Bigg Boss House
x

Bigg Boss 7: బిగ్‌బాస్‌ హౌస్‌లోకి టీమిండియా క్రికెటర్‌.. ఎవరో తెలుసా?

Highlights

Bigg Boss Telugu 7: టీవీ ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించే ప్రోగ్రామ్స్‌లో ‘బిగ్‌బాస్‌’ ఒకటిగా పేరుగాంచింది.

Bigg Boss Telugu 7: టీవీ ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించే ప్రోగ్రామ్స్‌లో ‘బిగ్‌బాస్‌’ ఒకటిగా పేరుగాంచింది. తెలుగులో ఇప్పటి వరకు 6 సీజన్లు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా 7వ సీజన్‌ (Bigg Boss Telugu 7)తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అయ్యారు మేకర్స్. ఈ మేరకు మేకర్స్‌ నెట్టింట్లో ఓ వీడియోని రిలీజ్ చేశారు. బిగ్ బాస్ 7 ప్రోగ్రాం త్వరలోనే టెలికాస్ట్ కానుందని తెలిపారు.

బిగ్‌బాస్‌ 7 ఎప్పుడు ప్రారంభం కానుంది? ఈసారి హౌస్‌లోకి వచ్చే కంటెస్టెంట్లు ఎవరు? అనే అంశాలపై ఓ పెద్ద చర్చ జరుగుతూనే ఉంది. ఇదిలా ఉంటే బిగ్‌బాస్‌7 కు సంబంధించిన ఒక వార్త ట్రెండింగ్‌లో ఉంది. అదేంటంటే.. టీమిండియా మాజీ క్రికెటర్‌, ఆంధ్రా ప్లేయర్‌ వై. వేణుగోపాల రావు ఈ మెగా షోలోకి రానున్నారని టాక్‌ వినిపిస్తోంది. ఇందుకోసం బిగ్‌బాస్‌ నిర్వాహకులు గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారట. భారత మాజీ క్రికెటర్, ఆంధ్ర ఆటగాడు వై.వేణుగోపాల రావు 2019లో ఆటకు గుడ్‌బై చెప్పాడు.

టీమిండియా తరుపున ఆడిన కొద్దిమంది తెలుగు క్రికెటర్లలో వేణుగోపాల రావు ఒకరు. భారత్ తరఫున ఆడింది తక్కువ మ్యాచులే అయిన్పటికీ.. ఐపీఎల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌కి దూరంగా ఉంటున్న వేణుగోపాల రావు.. ఐపీఎల్ మ్యాచుల సమయంలో స్టార్ స్పోర్ట్స్ తెలుగులో కామెంటరీ చేస్తూ అభిమానులను అలరిసున్నారు. ఇప్పుడు బిగ్‌బాస్‌లోకి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని నెట్టింట టాక్ వినిపిస్తుంది. ఇదే నిజమైతే ఫాన్స్ పండగ చేసుకోనున్నారు.

2005 జులైలో తొలి వన్డే ఆడిన అతని కెరీర్‌ పది నెలల వ్యవధిలోనే 16 వన్డేలకే (ఆరు వేర్వేరు జట్లపై కలిపి) పరిమితమైంది. వేణుగోపాలరావు అంతర్జాతీయ క్రికెట్‌లో తన ఏకైక అర్ధ సెంచరీ (93 బంతుల్లో 61 నాటౌట్‌) పాకిస్తాన్‌పై అబుదాబిలో సాధించాడు. దక్కన్‌ చార్జర్స్, సన్‌రైజర్స్‌ హైదరాబాద్, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ తరఫున కలిపి వేణు ఐపీఎల్‌లో మొత్తం 65 మ్యాచ్‌లు (2008–2014) ఆడాడు. ప్రధానంగా విజయ్‌ హజారే ట్రోఫీ, దేవధర్‌ ట్రోఫీ, చాలెంజర్‌ ట్రోఫీలో రాణించడంతో అతనికి వన్డే టీమ్‌ పిలుపు దక్కింది.



Show Full Article
Print Article
Next Story
More Stories