Nayanthara: నాడు షూటింగ్ లొకేషన్ కి గవర్నమెంట్ బస్సులో.. నేడు ప్రైవేట్ జెట్ లో

* చెన్నైలో పోస్ గార్డెన్ లో ఖరీదైన అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ కొనుగోలు చేసిన నయనతార

Sandeep Reddy
Published on: 30 Nov 2021 1:42 PM IST
Indian Actress Nayanthara Use to Travel in Government Bus to Shooting Location But Now She Owns Luxury Cars
X

Nayanthara: నాడు షూటింగ్ లొకేషన్ కి గవర్నమెంట్ బస్సులో.. నేడు ప్రైవేట్ జెట్ లో

Nayanthara: 2003లో "మనస్సినక్కరే" అనే మలయాళ సినిమాతో వెండితెరకి పరిచయమైన సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ నయనతార.. 2005 లో "అయ్యా" అనే తమిళ చిత్రంలో సెల్వి పాత్రతో తమిళ ప్రేక్షకులకు పరిచయమైంది. అయితే తన కెరీర్ లో ఇప్పటివరకు పలు భాషల్లో 80కి పైగా చిత్రాల్లో నటించిన నయనతార.. తాజాగా తెలుగులో గోపీచంద్ సరసన "ఆరడుగుల బుల్లెట్" చిత్రంతో పాటు మెగాస్టార్ చిరంజీవికి జోడిగా "గాడ్ ఫాదర్" చిత్రంలో హీరోయిన్ గా కనిపించబోతుంది.

అయితే తాజాగా నయన్.. చెన్నైలోని పోస్ గార్డెన్ ఏరియాలో ఒక ఖరీదైన అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ ని కొనుగోలు చేసి తమిళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచింది. అంతకుముందు తమిళ మాజీ ముఖ్యమంత్రి జయలలితతో పాటు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, ధనుష్ వంటి స్టార్ హీరోలు సైతం పోస్ గార్డెన్ ఏరియాలోనే ఉండటం విశేషం. అయితే తాజాగా నయనతారపై ఒక ఆసక్తికర విషయం బయటికి వచ్చింది.

తమిళంలో తన మొదటి చిత్రం "అయ్యా" షూటింగ్ లొకేషన్ కి ఒక గవర్నమెంట్ బస్సులో వచ్చిన నయనతార.. తాజాగా తనకంటూ సొంత లక్సరీ కార్లతో పాటు ఒక ప్రైవేట్ జెట్ ని కూడా రెంట్ కి తీసుకోగలిగే స్థాయికి ఎదగడంతో నిజంగా గొప్ప విషయమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక తాజాగా ఖరీదు చేసిన ఈ అపార్ట్ మెంట్ లో తన ప్రియుడు కాబోయే భర్త విజ్ఞేశ్ శివన్ తో కలిసి ఉండనున్నట్లు తెలుస్తుంది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story