Pushpa: రోజు రోజుకి సుకుమార్ పై పెరుగుతున్న పుష్ప ప్రెజర్

Pushpa: అల్లు అర్జున్ సినిమా వల్ల ప్రెషర్ బరిస్తున్న స్టార్ డైరెక్టర్

admin1
Updated on: 8 Nov 2021 2:55 PM IST
Pushpa Movie Pressure on Director Sukumar
X

సుకుమార్ పై పెరుగుతున్న పుష్ప ప్రెషర్ (ఫైల్ ఇమేజ్)

Pushpa: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం తన ఆశలన్నీ తన తదుపరి సినిమా పుష్ప పైనే పెట్టుకున్న సంగతి తెలిసిందే. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా కనిపించనుంది. రెండు భాగాలుగా విడుదల కాబోతున్న ఈ సినిమా మొదటి పార్ట్ "పుష్ప: ది రైజ్" వచ్చే నెల డిసెంబర్ 17వ తారీఖున థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఒకవైపు సినిమా ప్రమోషన్లో ఇంకా మిగిలి ఉండగా మరో వైపు సినిమా షూటింగ్లో కూడా కొంత భాగం మిగిలి ఉందట. సినిమా లోని ఒక ముఖ్యమైన పాట షూటింగ్ ఇంకా పూర్తి కాలేదట.

షూటింగ్ పూర్తి కావడానికి మరొక రెండు వారాలు సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో ఒకవైపు షూటింగ్ మరోవైపు నిర్మాణానంతర పనులు తో సుకుమార్ చాలా బిజీగా ఉన్నారు. మరోవైపు డెడ్ లైన్ లు కూడా ఉండటంతో సుకుమార్ పైన ప్రెజర్ రోజురోజుకీ పెరుగుతున్నట్లు తెలుస్తోంది. మరి ఇచ్చిన డెడ్ లైన్ లను సుకుమార్ ఎంతవరకు అందుకుంటారు ఇంకా తెలియాల్సి ఉంది. ఆర్య, ఆర్య 2 వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత అల్లు అర్జున్ మరియు సుకుమార్ ల కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మూడో సినిమా ఇది. దీంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

admin1

admin1

Next Story