Hanu Raghavapudi: హను రాఘవపూడి పై పెరుగుతున్న ప్రెషర్..నెక్స్ట్ సినిమా..

* నెక్స్ట్ సినిమా విషయంలో హను రాఘవపూడి ఏం చేయబోతున్నారు?

R Tripura Malini
Published on: 15 Dec 2022 3:55 PM IST
Increasing Pressure On Hanu Raghavapudi
X

హను రాఘవపూడి పై పెరుగుతున్న ప్రెషర్

Hanu Raghavapudi: సక్సెస్ స్ట్రీక్ ని కంటిన్యూ చేయడం చిన్న డైరెక్టర్ల నుంచి స్టార్ డైరెక్టర్ ల వరకు అందరికీ కష్టతరంగా మారింది. ఒక సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకొని స్టార్ స్టేటస్ ను అందుకున్న డైరెక్టర్లు సైతం తన తదుపరి సినిమాలతో ప్రేక్షకులను అదే స్థాయిలో మెప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అందులో కొంతమంది మాత్రమే సఫలమవ్వలగలరు. తాజాగా ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టాలనే ప్రెషర్ హను రాఘవపూడి మీద కూడా ఎక్కువగానే ఉంది.

"పడి పడి లేచే మనసు" సినిమాతో డిజాస్టర్ అందుకున్న హను రాఘవపూడి "సీతారామం" సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు. చాలా కాలం తర్వాత బాక్సాఫీస్ వద్ద ఇంత భారీ విజయాన్ని సాధించిన ఒక మంచి ప్రేమ కథగా "సీతారామం" సినిమా రికార్డు సృష్టించిందని చెప్పుకోవాలి. అయితే ఈ సినిమాతో ఇంత భారీ విజయాన్ని అందుకున్న హను రాఘవపూడి తన తదుపరి సినిమా విషయంలో ఏం చేయనున్నారు అనేది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది.

తన నెక్స్ట్ సినిమాకి కూడా హను రాఘవపూడి ఒక స్టార్ హీరోనే తీసుకోవాల్సి ఉంటుంది. సీతారామం వంటి సూపర్ హిట్ తర్వాత హాను రాఘవపూడి ఏదో ఒక స్టార్ హీరోని తన కథ తో కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ హను రాఘవపూడి తన తదుపరి సినిమా తో మెప్పించలేకపోతే "సీతారామం" క్రెడిట్ కూడా తనకి కాకుండా సినిమాని నిర్మించిన వైజయంతి మూవీస్ వారి ఖాతాలోనే పడిపోతుంది అని చెప్పుకోవచ్చు. అందుకే హను రాఘవపూడి ఇప్పుడు తన నెక్స్ట్ సినిమా విషయంలో కూడా అంతే జాగ్రత్తలు వహిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఏ స్టార్ హీరోని హను రాఘవపూడి రంగంలోకి దింపనున్నారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

R Tripura Malini

R Tripura Malini

Next Story