God Father: గాడ్ ఫాదర్ సినిమాతో రిస్క్ తీసుకోబోతున్న నిర్మాతలు

God Father: గాడ్ ఫాదర్ నిర్మాతలపై పెరుగుతున్న ప్రెషర్

Jyothi
Published on: 23 Sept 2022 1:41 PM IST
Increasing Pressure on God Father Producers
X

God Father: గాడ్ ఫాదర్ సినిమాతో రిస్క్ తీసుకోబోతున్న నిర్మాతలు

God Father: "ఆచార్య" సినిమాతో మర్చిపోలేని డిజాస్టర్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఇప్పుడు "గాడ్ ఫాదర్" సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. అయితే ఆచార్య సినిమా ఫ్లాప్ అవడంతో "గాడ్ ఫాదర్" సినిమాపై కూడా బజ్ చాలా తగ్గిపోయిందని చెప్పుకోవాలి. మలయాళం లో సూపర్ హిట్ అయిన "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకి మోహన్ రాజా దర్శకత్వం వహించారు. ఈ సినిమా అక్టోబర్ 5 న థియేటర్లలో విడుదల కి సిద్ధమవుతోంది. రాజకీయ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో చిరంజీవి ఒక రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

నిజ జీవితంలో కూడా చిరంజీవి కి రాజకీయాలతో కనెక్షన్ ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు ఒక దశాబ్దం పాటు చిరంజీవి సినిమాలకు బ్రేక్ ఇచ్చి మరీ రాజకీయాలలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో రైటర్లు చిరంజీవికి కొన్ని రాజకీయానికి సంబంధించిన కొన్ని పవర్ఫుల్ డైలాగ్ లు రాసినట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన ఒక డైలాగ్ ని చిరంజీవి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్ గా మారింది. అలాంటి పవర్ ఫుల్ డైలాగ్ లు "గాడ్ ఫాదర్" సినిమాలో ఇంకా చాలా ఉండబోతున్నాయని అవి ప్రేక్షకులకు బాగా మెప్పిస్తాయని చిత్ర బృందం భావిస్తోంది. నయనతార, సత్యదేవ్, ముఖ్యపాత్రలో పోషిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కూడా ముఖ్యపాత్రలో కనిపించనున్నారు.

Jyothi

Jyothi

Next Story