షారుఖ్ ఖాన్ సినిమా వల్ల అఖిల్ సినిమాపై ప్రభావం..

Increased pressure on Agent by Pathaan
x

"పఠాన్" వల్ల "ఏజెంట్" పై పెరిగిన ప్రెషర్

Highlights

* షారుఖ్ ఖాన్ సినిమా వల్ల అఖిల్ సినిమాపై ప్రభావం..

Akhil and ShahRukh Khan: గత కొంతకాలంగా సినిమాలకి దూరంగా ఉంటున్న బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ ఈ మధ్యనే "పఠాన్" సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. హిందీలో బ్లాక్ బస్టర్ టాక్ అందుకొని బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్లు నమోదు చేసుకుంటున్నా ఈ సినిమాకి తెలుగులో మాత్రం అంత మంచి రెస్పాన్స్ రావడం లేదు. సినిమాలో యాక్షన్ ఎలిమెంట్లు బాగానే ఉన్నప్పటికీ సినిమాలో ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే విధంగా లేవని విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఏమాత్రం బాగాలేదని కొందరు కామెంట్లు చేస్తున్నారు.

ఈ కారణాలవల్లే హిందీలో సూపర్ హిట్ అవుతున్న ఈ సినిమా తెలుగులో మాత్రం యావరేజ్ టాక్ ను అందుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా రిజల్ట్ చూశాక యువ హీరో అక్కినేని అఖిల్ నెక్స్ట్ సినిమా ఏజెంట్ పైన కూడా ప్రెషర్ పెరిగిపోతుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న సినిమా ఏజెంట్. ఒక స్పై పాత్రలో అఖిల్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. ఇప్పటిదాకా ఒక్క బ్లాక్ బస్టర్ కూడా లేని అఖిల్ ఈ సినిమాతో ఆయన మంచి హిట్ అందుకుంటాడని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ బాగాలేదని సినిమాలోని కొన్ని సన్నివేశాలను మళ్లీ రీషూట్ చేస్తోంది చిత్ర బృందం. ఈ నేపథ్యంలో సినిమా బాగా ఆలస్యం అవుతుండడంతో ప్రేక్షకులు కూడా నిరాశ చెందుతున్నారు. రీ షూట్ కారణంతో సినిమా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. కనీసం ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా సినిమా విడుదలకి సంబంధించిన విడుదల తేదీని ప్రకటిస్తామని అందరూ అనుకున్నారు కానీ అభిమానులు కు మళ్లీ నిరాశ మాత్రమే మిగిలింది.

Show Full Article
Print Article
Next Story
More Stories