విజయ్‌కి షాక్.. ఇంట్లో ఐటీ అధికారులు తనిఖీలు

విజయ్‌కి షాక్.. ఇంట్లో ఐటీ అధికారులు తనిఖీలు
x
Vijay File Photo
Highlights

కోలీవుడ్ టాప్ హీరో విజయ్ నివాసంపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేపట్టారు. కొద్దిరోజుల కిందటే శాండల్ వుడ్ యంగ్ హీరోయిన్ రష్మిక మందన్న ఇంటిపై...

కోలీవుడ్ టాప్ హీరో విజయ్ నివాసంపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేపట్టారు. కొద్దిరోజుల కిందటే శాండల్ వుడ్ యంగ్ హీరోయిన్ రష్మిక మందన్న ఇంటిపై దాడులు చేపట్టిన ఐటీ అధికారులు తాజాగా విజయ్‌ని టార్గెట్ చేయడం తమిళ చిత్ర పరిశ్రమలో కలకలం రేపుతోంది. విజయ్‌తో పాటు చిత్ర నిర్మాణ సంస్థ ఏజీఎస్ సినిమాస్, ప్రముఖ ఫిల్మ్ ఫైనాన్షియర్ అన్బు చెలియన్ కార్యాలయంలోనూ ఐటీ అధికారులు సోదాలను నిర్వహించారు.

విజయ్ హీరోగా ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ కింద బిగిల్ సినిమా తెరకెక్కింది. గత ఏడాది విడుదలైన ఈ సినిమా బడ్జెట్ సుమారు 120 కోట్ల రూపాయలుగా తేలింది. ఆ సందర్భంగా అన్బు చెలియన్ సహా ఏజీఎస్ సినిమాస్ సంస్థ నిర్వాహకులు పెద్ద మొత్తంలో ఆదాయపు పన్నులను లెక్క చూపలేదని చెబుతున్నారు. ఈ సినిమా నిర్మాణ వ్యయం విషయంలో సరైన సమాచారాన్ని ఇవ్వలేదనే కారణంతో ఐటీ అధికారులు దాడులు చేస్తున్నట్లు తెలిసింది.

ఐటీ శాఖ అధికారులు విజయ్ ను ప్రశ్నించారు. ఏజీఎస్ సినిమాస్ ఆస్తులు, ఫైనాన్షియర్ అంబు చెలియాన్ నివాసం, ఆఫీసుల్లో సోదాలు చేశారు. విజయ్ సినిమా బిగిల్(విజిల్) చిత్రాన్ని ఏజీఎస్ సినిమాస్ నిర్మించింది. ప్రస్తుతం కడలూరులో మాస్టర్ చిత్రం చిత్రీకరణలో విజయ్ ఉన్నప్పుడు ఐటీ అధికారులు విజయ్ ను తీసుకెళ్లారు. దీంతో షూటింగ్ మధ్యలోనే నిలిచిపోయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories