ప్రియదర్శి 'IN The Name Of God' ఫస్ట్ లుక్

IN The Name Of God:తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని అందించ‌డానికి ఓటీటీ ప్ర‌పంచంలోకి అడుగుపెట్టింది ''ఆహా''.

Samba Siva Rao
Published on: 18 May 2021 3:31 PM IST
InTheNameofGod First Look
X

InTheNameofGod

IN The Name Of God: తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని అందించ‌డానికి ఓటీటీ ప్ర‌పంచంలోకి అడుగుపెట్టింది ''ఆహా''. 100% తెలుగు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ అనే నినాదంలో వ‌చ్చిన ఆహా.. సినిమాలు , ఒరిజినల్స్, వెబ్ సిరీస్ లు, స్పెషల్ షోలతో వీక్షకులను అలరిస్తోంది.క్రాక్, నాంది, జాంబిరెడ్డి, గాలి సంప‌త్ వంటి సూప‌ర్ హిట్ చిత్రాలు ఇప్ప‌టికే స్ట్రీమ్ అవుతున్నాయి. కాగా. ఎప్పటికప్పుడు ఫ్రెష్ కంటెంట్ ని అందిస్తూ ఆదరణ పొందుతున్న 'ఆహా' ఓటీటీ.. మ‌రోసారి ఈ స‌మ్మ‌ర్ లో ఫుల్ ఎంట‌ర్ టైన్ చేయ‌నుంది.

ఆహాలో ఇప్పుడు 'ఇ న్ ది నేమ్ ఆఫ్ గాడ్' (ఐ.ఎన్.జి) అనే క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ని రెడీ చేసింది. అయితే ఇన్నాళ్లూ తన కామెడీతో నవ్వించిన ప్రియదర్శి.. ఇందులో సీరియస్ రోల్ లో కనిపించబోతున్నాడు. క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న ''ఐ.ఎన్.జి'' సిరీస్ లో కమెడియన్ ప్రియదర్శి లీడ్ రోల్ పోషిస్తున్నారు. హీరోయిన్ గా నందినీ రాయ్ నటిస్తోంది. అనౌన్స్ మెంట్ తోనే ఆసక్తిని కలిగించిన మేకర్స్.. తాజాగా 'ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్' ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. త్త దర్శకుడు విద్యాసాగర్ ముత్తుకుమార్ తెర‌కెక్కిస్తున్నారు.

ఈ క్రైమ్ థ్రిల్లర్ త్వరలో 'ఆహా' ఓటీటీలో విడుదల కానుంది. ఇందులో గాయాలతో ఉన్న ప్రియదర్శి సిగరెట్ వెలిగించుకుంటూ సీరియస్ లుక్ లో కనిపిస్తున్నాడు. నందినీ రాయ్ ఇంటెన్స్ లుక్ లో ఉంది. వెరైటీగా డిజైన్ చేయబడిన ఈ పోస్టర్ సిరీస్ పై ఇంట్రస్ట్ ని క్రియేట్ చేస్తోంది. సురేష్ కృష్ణ ప్రొడక్షన్స్ ప్రై.లిమిటెడ్ బ్యానర్ పై సీనియర్ దర్శకుడు సురేష్ కృష్ణ ఈ వెబ్ సిరీస్ ను నిర్మిస్తున్నారు. ''ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్'' (ఐ.ఎన్.జి) క్రైమ్ థ్రిల్లర్ కి కొవరుణ్ డీకే సినిమాటోగ్రఫీ అందించగా.. నిఖిల్ శ్రీకుమార్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. దీపక్ అలెగ్జాండర్ సంగీతం సమకూరుస్తున్నారు.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story