రజినీ కాంత్ సినిమాలో ప్రముఖ మలయాళం నటుడు

* రజినీ కాంత్ సినిమాలో ప్రముఖ మలయాళం నటుడు

Dhatripriya
Updated on: 8 Jan 2023 3:29 PM IST
In Rajinikanth Movie Famous Malayali Actor
X

రజినీ కాంత్ సినిమాలో ప్రముఖ మలయాళం నటుడు

Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ త్వరలోనే తన తదుపరి చిత్రం "జైలర్" తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కు మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. దీంతో సినిమా ఎలా ఉంటుందో అని అభిమానులు కంగారు పడుతున్న సమయంలో చిత్ర బ్రుండమొక ఆసక్తికరమైన అప్డేట్ ను విడుదల చేసింది. మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయని చెప్పుకోవచ్చు. జనవరి 8 నుంచి సినిమా షూటింగ్లో మోహన్ లాల్ కూడా పాల్గొనబోతున్నారని సమాచారం. మరోవైపు కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. తాజాగా సినిమా గురించి మాట్లాడుతూ శివరాజ్ కుమార్ కూడా సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. "రజినీకాంత్ గారి పక్కన నటించటం నిజంగా ఒక గొప్ప అవకాశం. ఈ ప్రాజెక్టు నాకు దొరికిందని నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఆయనకు నేను చిన్నప్పటి నుంచి తెలుసు. పాత్ర ఎలాంటిదైనా ఆ సినిమాలో ఒక భాగమైనందుకు నాకు చాలా ఆనందంగా ఉంది," అని అన్నారు శివ రాజ్ శేఖర్.

అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. సన్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ, యోగిబాబు, వసంత్ రవి, వినాయకన్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ఏడాది వేసవిలో సినిమా విడుదల కానుంది. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమా కి దర్శకత్వం వహిస్తున్నారు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.

Dhatripriya

Dhatripriya

Next Story