NTR 30: ఎన్టీఆర్30 విషయంలో కీలకమైన అప్డేట్

NTR 30: కొరటాల శివ ఎన్టీఆర్ కి ఫైనల్ నేరేషన్ ఇచ్చేశారా

Jyothi
Updated on: 24 Sept 2022 9:30 AM IST
Important Update Regarding NTR 30
X

NTR 30: ఎన్టీఆర్30 విషయంలో కీలకమైన అప్డేట్ 

NTR 30: "ఆర్ ఆర్ ఆర్" సినిమాతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్యాన్ ఇండియన్ స్టార్ గా మారిపోయారు. ప్రస్తుతం ఎన్టీఆర్ తదుపరి సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రకటించి ఇప్పటికే నెలలు గడిచింది కానీ ఇంకా ఈ సినిమా షూటింగ్ మాత్రం పట్టాలెక్కలేదు. అయితే "ఆచార్య" సినిమాతో మొట్టమొదటి డిజాస్టర్ ను అందుకున్న కొరటాల శివ ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో బోలెడు జాగ్రత్తలు వహిస్తున్నారు అని, అందుకే సినిమా ఆలస్యం అవుతుందని కొన్ని పుకార్లు బయటకు వచ్చాయి.

అయితే తాజా సమాచారం ప్రకారం కొరటాల శివ ఈ మధ్యనే ఎన్టీఆర్ ను కలిసి సినిమా స్క్రిప్ట్ కి సంబంధించి ఒక ఫైనల్ నెరేషన్ కూడా ఇచ్చారు అని తెలుస్తోంది. ఎన్టీఆర్ ఇంకా తన ఫైనల్ కాల్ చెప్పాలి ఉంది. అన్నీ ఓకే అయితే షూటింగ్ త్వరలోనే పట్టలెక్కుతుంది. ఇక ఈ సినిమా కోసం ముందుగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ను హీరోయిన్ గా అనుకున్నారు. కానీ ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుంది. ప్రస్తుతం హీరోయిన్ కి సంబందించిన అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. యువసుధ ఆర్ట్స్ పతాకంపై పై కళ్యాణ్ రామ్ సమర్పిస్తున్న ఈ సినిమాను సుధాకర్ మిక్కిలినేని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నట్టు సమాచారం.

Jyothi

Jyothi

Next Story