Naga Chaitanya: నాగ చైతన్య కోసం సంగీతాన్ని అందించనున్న తండ్రి కొడుకులు

Naga Chaitanya Movie: ఈ మధ్యనే తమిళంలో శింబు హీరోగా నటించిన "మానాడు" సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు...

Arun Chilukuri
Updated on: 16 Jun 2022 5:30 PM IST
Illaiyaraaja and Yuvan Shankara Raja to Make Music for Naga Chaitanya Movie
X

Naga Chaitanya: నాగ చైతన్య కోసం సంగీతాన్ని అందించనున్న తండ్రి కొడుకులు

Naga Chaitanya Movie: ఈ మధ్యనే తమిళంలో శింబు హీరోగా నటించిన "మానాడు" సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు తాజాగా ఇప్పుడు ఒక తెలుగు తమిళ్బైలింగువల్ సినిమాతో బిజీగా ఉన్నారు. ప్రముఖ టాలీవుడ్ యువ హీరో నాగచైతన్య ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. తమిళంలో నాగచైతన్య నటిస్తున్న మొట్టమొదటి సినిమా ఇది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 23వ తేదీ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే తాజాగా ఈ సినిమాకి సంగీతాన్ని అందించడం కోసం ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లను దర్శకనిర్మాతలు రంగంలోకి దించినట్లు తెలుస్తోంది.

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా మరియు ఆయన తనయుడు యువన్ శంకర్ రాజా ఈ ఇద్దరూ కలిసి ఈ సినిమాకి సంగీతాన్ని అందించనున్నారట. ఇలా నాగ చైతన్య సినిమా కోసం తండ్రి కొడుకులు సంగీతాన్ని అందించడానికి రెడీ అయ్యారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. ఇక వీరిద్దరూ దర్శకుడు వెంకట్ ప్రభు కూడా దగ్గరి బంధువులు. వచ్చే నెల 12వ తేదీ నుంచి ఈ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ పనులు మొదలవుతాయి. మరోవైపు నాగచైతన్య నటిస్తున్న "థాంక్యూ" సినిమా జూలై 8 వ తేదీన విడుదల కాబోతుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story