స్టార్‌ హీరోయిన్‌ సోదరుడితో ఇలియానా ప్రేమాయణం..?

Ileana D'Cruz: గోవా బ్యూటీ ఇలియానా మరోసారి ప్రేమలో పడినట్లు తెలుస్తోంది.

Arun Chilukuri
Published on: 17 July 2022 4:54 PM IST
Ileana D’Cruz Dating With Katrina Kaif’s Brother Sebastian Laurent Michel
X

స్టార్‌ హీరోయిన్‌ సోదరుడితో ఇలియానా ప్రేమాయణం..?

Ileana D'Cruz: గోవా బ్యూటీ ఇలియానా మరోసారి ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌కు చెందిన ఓ స్టార్‌ హీరోయిన్‌ సోదరుడితో ఆమె డేటింగ్‌లో ఉన్నారంటూ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ ఆ బాలీవుడ్‌ హీరోయిన్‌ ఎవరంటే కత్రినా కైఫ్‌. కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్, ఇలియానా ప్రేమలో ఉన్నారని బాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. ఇందుకు బలం చేకూరేలా కత్రినా కుటుంబ సభ్యులతో కలిసి ఇలియానా ఇటీవల విహార యాత్రకు వెళ్లింది.

ఈనెల 16న కత్రినా కైఫ్ తన 39వ పుట్టినరోజును మాల్దీవుల్లో జరుపుకుంది. కత్రినా వెంట ఆమె భర్త, హీరో విక్కీ కౌశల్‌, సోదరుడు సెబాస్టియన్, ఇలియానా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. కత్రినా కుటుంబ సభ్యులతో తీసుకున్న సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 'సన్‌షైన్, కాక్‌టెయిల్స్, బర్త్ డే కేక్' అని దీనికి క్యాప్షన్ ఇచ్చింది. సెబాస్టియన్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను ఇలియానా గత కొంత కాలంగా ఫాలో అవుతుండటం విశేషం. కానీ, ఈ వదంతులపై ఇలియానా, సెబాస్టియన్ ఇప్పటి వరకు కామెంట్ చేయలేదు. ఇలియానా గతంలో ఆండ్రూ నీబోన్‌తో సహజీవనం చేసింది. కొన్నాళ్ల పాటు ఆ బంధం బలంగానే కొనసాగింది. ఏమైందో తెలియదు కానీ, అనివార్య కారణాల వల్ల వారు విడిపోయారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story