Ileana D'Cruz: పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న ఇలియానా..!

బిడ్డ గురించి షాకింగ్ అప్డేట్ ఇచ్చిన ఇలియానా

Arun Chilukuri
Updated on: 18 April 2023 1:00 PM IST
Ileana DCruz Announces Pregnancy with a Instagram Post
X

Ileana D'Cruz: పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న ఇలియానా..!

Ileana D'Cruz: ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ల జాబితాలో ఒకరిగా ఉండి గత కొన్నాళ్లుగా సినిమాలకి దూరంగా ఉంటున్న హీరోయిన్ ఇలియానా డిక్రూజ్. అయితే సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే ఉండే ఈ భామ తాజాగా ఇప్పుడు ఒక షాకింగ్ ప్రకటన చేసి అభిమానులను సైతం షాక్ కి గురి చేసింది. తాజాగా ఇలియానా సోషల్ మీడియా లో చేసిన ఒక పోస్ట్ వైరల్ గా మారింది. మంగళవారం ఉదయం ఇలియానా తన జీవితం లోకి ఒక పసికందును స్వాగతించి షాక్ ఇచ్చింది.

తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా లో ఇలియానా ఒక బేబీ కాస్ట్యూమ్ లో ఒక ఫోటో ను షేర్ చేస్తూ, "త్వరలో రాబోతోంది. నిన్ను కలవడానికి ఎదురు చూస్తున్నాను నా చిన్ని డార్లింగ్" అని రాసిన ఇలియానా 'మామా' అని రాసి ఉన్న లాకెట్టు ఫోటోను కూడా షేర్ చేసింది. గతంలో ఆండ్రూ అనే ఫోటోగ్రాఫర్ తో ప్రేమలో మునిగి తేలిన ఇలియానా అతనితో బ్రేక్ అప్ చేసుకుని కూడా చాలా కాలం అయ్యింది. ప్రస్తుతం ఇలియానా ప్రియుడు లేదా భర్త గురించి ఎంటువంటి వివరాలు ఇంకా బయటకి రాలేదు కానీ ఇలియానా ఇప్పుడు తల్లి కాబోతుండడంపై పలు రకాల కామెంట్లు వినిపిస్తున్నాయి.

అయితే, ఇలియానా కూడా నయనతార లాగా సరోగసీ ద్వారా తల్లి అయ్యి ఉండచ్చని కొందరు అంటున్నారు. మరోవైపు కత్రినా కైఫ్ యొక్క 45 ఏళ్ల సోదరుడు సెబాస్టియన్‌తో ఇలియానా డేటింగ్ చేస్తుందని కూడా వార్తలు వచ్చాయి. కత్రినా మరియు విక్కీ కౌశల్ తో పాటు ఇలియానా సెబాస్టియన్ తో అనేక ఈవెంట్‌లలో కలిసి కనిపించారు. మరి ఇలియానా సరోగసీ ద్వారా బిడ్డకి జన్మనిస్తుందా లేదా అని మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story