Ileana: బికినీ తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఇలియానా

Ileana: ఇలియానా ఫోటోలు వారి కోసమేనా?

admin1
Updated on: 5 Dec 2021 2:42 PM IST
Ileana Bikini Photos Goes Viral in Social Media
X

అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఇలియానా బికినీ ఫోటోలు (ఫైల్ ఇమేజ్)

Ileana: ఒకప్పుడు స్టార్ స్టేటస్ ని అనుభవించిన హీరోయిన్లలో ఇలియానా కూడా ఒకరు. దేవదాసు, పోకిరి, జల్సా, రాఖీ, కిక్ వంటి సూపర్ హిట్ సినిమాలలో నటించిన ఈ గోవా బ్యూటీ జులాయి, దేవుడు చేసిన మనుషులు సినిమాల తర్వాత తెలుగు ఇండస్ట్రీకి దూరమైంది. ఆ తర్వాత మళ్లీ ఈ మధ్యన 2018 లో రవితేజ హీరోగా నటించిన "అమర్ అక్బర్ ఆంటోనీ" సినిమాతో మళ్లీ ప్రేక్షకులకు పలకరించింది కానీ ఆ సినిమా అనుకున్న స్థాయిలో హిట్ అవలేదు. అయితే తాజాగా ఇలియానా మాల్దీవ్స్ కి వెకేషన్ కి వెళ్ళింది.

అక్కడ తన బికినీ ఫోటోలు, అల్ట్రా గ్లామరస్ ఫోటోలని సోషల్ మీడియా ద్వారా పంచుకుంటోంది ఇలియానా. దీంతో కొందరు మాత్రం ఇలియానా ఇది కావాలనే దర్శకనిర్మాతల దృష్టిలో పడాలని చేస్తోందని ఆమె మళ్ళీ తిరిగి సినిమాల్లో అడుగుపెట్టాలని ప్రయత్నాలు చేస్తోందని అందుకనే ఇలా తన హాట్ ఫోటోలతో వార్తల్లో నిలుస్తోంది అని చెబుతున్నారు. ఇక మరోవైపు బాలీవుడ్లో ఇలియానా ఈ మధ్యనే "ది బిగ్ బుల్" అనే సినిమాలో నటించింది. ప్రస్తుతం రణదీప్ హూడా హీరోగా నటిస్తున్న "తేరా క్యా హోగా లవ్లీ" సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది ఇలియానా.


admin1

admin1

Next Story