Ilaiyaraaja: ఇళయరాజాకు భారీ షాక్.. ఆ 134 సినిమాల పాటల హక్కులు ఆయనవి కావు! ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు

Ilaiyaraaja: ఇళయరాజాకు భారీ షాక్.. ఆ 134 సినిమాల పాటల హక్కులు ఆయనవి కావు! ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు
x
Highlights

Ilaiyaraaja: తన అద్భుత స్వరాలతో దశాబ్దాలుగా సంగీత ప్రియులను అలరిస్తున్న 'మ్యూజిక్ మాస్ట్రో' ఇళయరాజాకు న్యాయస్థానంలో చుక్కెదురైంది.

Ilaiyaraaja: తన అద్భుత స్వరాలతో దశాబ్దాలుగా సంగీత ప్రియులను అలరిస్తున్న 'మ్యూజిక్ మాస్ట్రో' ఇళయరాజాకు న్యాయస్థానంలో చుక్కెదురైంది. తన సొంత పాటలపై హక్కుల కోసం ఆయన చేస్తున్న సుదీర్ఘ పోరాటంలో ఢిల్లీ హైకోర్టు తాజాగా ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఇళయరాజాకు ప్రతికూలంగా మారాయి.

1976 నుండి 2001 మధ్య కాలంలో ఇళయరాజా సంగీతం అందించిన దాదాపు 134 సినిమాల ఆడియో హక్కులు ప్రముఖ సంస్థ ‘సరిగమ’ (Saregama) కే చెందుతాయని కోర్టు స్పష్టం చేసింది. నాటి చిత్ర నిర్మాతలు తమ ఆడియో హక్కులను శాశ్వత ప్రాతిపదికన సరిగమకు విక్రయించారని, కాబట్టి కాపీరైట్ చట్టం ప్రకారం ఆ పాటలపై ఇళయరాజాకు యాజమాన్య హక్కులు ఉండవని జస్టిస్ తుషార్ రావు గెడేలా తీర్పునిచ్చారు.

ఈ వివాదం ‘ఎప్ ఇనియా పొన్ నిలవే’ వంటి ఆల్‌టైమ్ హిట్ సాంగ్‌తో మొదలైంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ఈ పాటల వినియోగానికి ఇళయరాజా అనుమతులు ఇవ్వడాన్ని సరిగమ సంస్థ సవాల్ చేసింది.

కోర్టు కీలక వ్యాఖ్యలు:

"సినిమా నిర్మాణ సమయంలో నిర్మాత వద్ద వేతనం తీసుకుని కంపోజ్ చేసిన పాటలపై ప్రాథమిక హక్కులు నిర్మాతకే ఉంటాయి." "నిర్మాతలు ఆ హక్కులను సరిగమకు బదిలీ చేసినందున, చట్టబద్ధంగా ఆ సంస్థే యజమాని అవుతుంది." ఈ క్రమంలో ఇళయరాజా వాదనను తోసిపుచ్చిన కోర్టు, సరిగమకు అనుకూలంగా తీర్పునిచ్చింది.

ఈ తీర్పు ఇళయరాజా అభిమానులను నిరాశకు గురిచేసినప్పటికీ, దీనిపై పైకోర్టులో అప్పీల్ చేసే అవకాశాన్ని ధర్మాసనం ఆయనకు కల్పించింది. ఇళయరాజా లీగల్ టీమ్ ఈ తీర్పును సవాల్ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories