Krithi Shetty: కథ బాగుంటేనే సినిమా ఓకే చేస్తున్న కృతి శెట్టి

Krithi Shetty: తదుపరి సినిమాల విషయంలో రీ థింక్ చేస్తున్న హీరోయిన్

Jyothi
Updated on: 7 Jan 2023 10:01 AM IST
If the Story is Good the Movie is Okay For Kriti Shetty
X

Krithi Shetty: కథ బాగుంటేనే సినిమా ఓకే చేస్తున్న కృతి శెట్టి

Krithi Shetty: "ఉప్పెన" సినిమాతో తెలుగుతరకి హీరోయిన్ గా పరిచయమైన కృతి శెట్టి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకుంది. ఆ తరువాత నాని సరసన "శ్యామ్ సింగ రాయి", నాగచైతన్యతో "బంగార్రాజు" వంటి వరుస సూపర్ హిట్లతో గోల్డెన్ లెగ్గా మారిపోయింది కృతి శెట్టి. ఆ తర్వాత వరుసగా "ది వారియర్", "మాచర్ల నియోజకవర్గం", "ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి" వంటి సినిమాలతో మళ్ళీ కృతి శెట్టి వరుస డిజాస్టర్ లను అందుకుంది. దీంతో కృతి శెట్టి ఇప్పుడు తన తదుపరి సినిమాల విషయంలో కొంత జాగ్రత్తగా ఆలోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తన చేతుల్లో ఉన్న కథల గురించి కూడా తాను రీ థింక్ చేస్తున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల భోగట్టా.

ప్రస్తుతం కృతి శెట్టి మలయాళం లో టోవినో తోమస్ సరసన ఒక పీరియాడికల్ డ్రామా తో సినిమాతో నెలలో నటిస్తోంది. మరోవైపు కోలీవుడ్ నుంచి కూడా సూర్య హీరోగా నటిస్తున్న ఒక సినిమా ఆఫర్ వచ్చింది కానీ అది మిస్ అయింది. అయితే ఆఫర్ ఇచ్చింది స్టార్ నిర్మాత లేదా స్టార్ డైరెక్టర్ అయినప్పటికీ కథ విషయంలో కృతి శెట్టి చాలా జాగ్రత్తగా ఉంటుందట. రెమ్యూనరేషన్ ఎక్కువ ఇస్తానన్నా కూడా కథ బాగుంటేనే సినిమా చేస్తానని చెబుతోందట. వరుసగా మూడు ఫ్లాప్ సినిమాలు వచ్చేసరికి కృతి శెట్టికి సీన్ బాగా అర్థమయిపోయిందని, అందుకే తనలో ఈ మార్పు కూడా వచ్చిందని, ఈ తెలివితేటలతో కృతి శెట్టి లాంగ్ రన్ లో హీరోయిన్ గా నెట్టుకు రాగలదని కొందరు కామెంట్లు చేస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story