Nandamuri Balakrishna: బాలకృష్ణ "భీమ్లా నాయక్" గా మారితే?

Nandamuri Balakrishna: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమా "భీమ్లా నాయక్" కాసుల వర్షం కురిపిస్తోంది.

admin1
Published on: 1 March 2022 12:52 PM IST
If Nandamuri Balakrishna Acted in Pawan Kalyans Bheemla Nayak Movie | Tollywood News
X

Nandamuri Balakrishna: బాలకృష్ణ "భీమ్లా నాయక్" గా మారితే?

Nandamuri Balakrishna - Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమా "భీమ్లా నాయక్" కాసుల వర్షం కురిపిస్తోంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన "అయ్యప్పనుం కోషీయిం" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాకి సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగులు అందించారు. ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కళ్యాణ్ అద్భుతమైన నటనను కనబరిచారు.

అయితే ఈ సినిమా కోసం ముందుగా నందమూరి బాలకృష్ణను సంప్రదించారు దర్శక నిర్మాతలు. కానీ రీమేక్ సినిమా కాబట్టి బాలకృష్ణ సినిమాపై అంతగా ఆసక్తి చూపించలేదట. ఈ నేపథ్యంలో నందమూరి అభిమానులు ఈ సినిమాలో బాలకృష్ణ హీరో గా చేసుంటే ఎలా ఉండేది అంటూ నెట్టింట్లో డిస్కషన్ మొదలుపెట్టారు. ఇప్పటి దాకా ఎన్నో మాస్ సినిమాల్లో కనిపించిన బాలకృష్ణ ఈ సినిమాలో కూడా పోలీస్ ఆఫీసర్ పాత్రలో అలవోకగా ఒదిగిపోయే వారు.

ఇక యాక్షన్ సన్నివేశాలకు బాలకృష్ణ పెట్టింది పేరు కాబట్టి ఈ సినిమాలో కూడా ఫైట్ సన్నివేశాల్లో అదరగొట్టేవారు. ఇక డైలాగ్ డెలివరీ విషయంలో బాలకృష్ణ కి సాటి ఎవ్వరు లేరు. ఇక ఎస్.ఎస్ తమన్ అందించిన సంగీతం మరియు సినిమాటోగ్రాఫర్ అందించిన విజువల్స్ తో సినిమా బ్లాక్ బస్టర్ అయ్యుండేది అనడంలో అతిశయోక్తి లేదు.

admin1

admin1

Next Story