"లైగర్" వెనుక బన్నీ ఐడియా ఉంది అంటున్న పూరి

బన్నీ వల్లే విజయ్ దేవరకొండ పాత్ర కి నత్తి పెట్టిన పూరి

Arun Chilukuri
Updated on: 24 Aug 2022 9:16 PM IST
Idea for Liger Came From Allu Arjun Says Puri Jagannadh
X

"లైగర్" వెనుక బన్నీ ఐడియా ఉంది అంటున్న పూరి

Puri Jagannadh: ఈ మధ్యనే "ఇస్మార్ట్ శంకర్" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తాజాగా ఇప్పుడు విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న "లైగర్" సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. తాజాగా సినిమాకి సంబంధించిన ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు పూరి. "చాలా కాలం క్రితం అల్లు అర్జున్ నాతో మాట్లాడుతూ హీరోకి ఏదైనా లోపం పెట్టే ఒక కథను రెడీ చేయచ్చుగా అని అన్నారు. అప్పుడే నత్తి ఉండే హీరో పాత్రను డిజైన్ చేసుకోవాలని అనుకున్నాను. మొదటి నుంచి కూడా నాకు మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ఒక సినిమా చేయాలని కోరిక ఉంది కాబట్టి అలా బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ తీసుకుని ఆ బాక్సర్ కి న నత్తి పెట్టేశాను. ఈ ఆలోచన వెనుక బన్నీ ఉన్నాడు," అని అన్నారు పూరి.

"షూటింగ్ మొదటి రోజున కెమెరా వెనుక నుంచి విజయ్ పెర్ఫార్మెన్స్ చూసి రమ్య కృష్ణ క్లాప్స్ కొట్టారు," అని చెప్పుకొచ్చారు పూరి. "నేను డైరెక్టర్ అవ్వకముందు నుండే నుంచే రాజమౌళిగారితో మంచి స్నేహం ఉంది. విజయేంద్ర ప్రసాద్ గారు పెద్ద రైటర్. అసలు అప్పట్లో ఆయనతో మాట్లాడాలంటేనే చాలా భయంగా ఉండేది. అలాంటిది ఆయన ఫోన్లో వాల్ పేపర్ గా నా ఫోటో పెట్టుకోవడం అంటే అది నాకు దక్కిన పెద్ద అవార్డుగా భావిస్తున్నాను," అని అన్న పూరి ఇంతవరకూ చాలా ఫాస్టుగా సినిమాలు చేస్తూ వచ్చాను కానీ ఇకపై సుకుమార్ మాదిరిగానే సమయం తీసుకుని చేయాలనుకుంటున్నట్టు చెప్పారు పూరి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story