Akkineni Sushanth: సెన్సార్ పూర్తి చేసుకున్న "ఇచ్చట వాహనములు నిలుపరాదు"

admin1
Updated on: 18 Aug 2021 1:52 PM IST
Ichata Vahanamulu nilupa radu Movie Got U/A Certificate By Censor Board
X

ఇచ్చట వాహనములు నిలుపరాదు పోస్టర్(ట్విట్టర్ ఫోటో)

Tollywood: ఈ మధ్యనే "చి.ల.సౌ" సినిమాతో మంచి హిట్ అందుకున్న అక్కినేని యువ హీరో సుశాంత్ ఒక చిన్న బ్రేక్ తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించడానికి సిద్ధమవుతున్నాడు. "ఇచ్చట వాహనములు నిలుపరాదు" అనే ఒక కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు సుశాంత్. 2018లో ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో ఫస్ట్ రన్నరప్ గా నిలిచిన మీనాక్షి చౌదరి ఈ సినిమాలో సుశాంత్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఎస్ దర్శన్ అనే ఒక కొత్త దర్శకుడు ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. నిజానికి ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా వల్ల చాలాసార్లు వాయిదా పడి తాజాగా ఇన్నాళ్ళ తర్వాత విడుదలకు సిద్ధం అవుతోంది.

సినిమా ఆగస్టు 27న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా "ఇచ్చట వాహనములు నిలుపరాదు" సినిమా సెన్సార్ సర్టిఫికేషన్ ను పూర్తి చేసుకుంది. యూ/ఏ సర్టిఫికెట్ తో బయటకు వచ్చిన ఈ సినిమా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రవి శంకర్‌ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీశ్‌ కోయలగుండ్ల నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతోంది. ఒక వైవిధ్యమైన థ్రిల్లర్‌గా ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకుంటున్న ఈ సినిమాలో వెన్నెల కిషోర్, ప్రియదర్శి, వెంకట్‌ కీలక పాత్రల్లో నటించారు. ప్రవీణ్‌ లక్కరాజు సంగీతాన్ని అందించారు.

admin1

admin1

Next Story