Sharwanand: "సినిమా సమయంలో డిప్రెషన్ కి వెళ్ళాను" అంటున్న శర్వానంద్

Sharwanand: "ఒకే ఒక జీవితం" వల్ల డిప్రెషన్ కి వెళ్ళాను అంటున్న శర్వానంద్

Jyothi
Updated on: 11 Sept 2022 1:31 PM IST
I Went into Depression During the Movie Says Sharwanand
X

Sharwanand: "సినిమా సమయంలో డిప్రెషన్ కి వెళ్ళాను" అంటున్న శర్వానంద్ 

Sharwanand: గత కొద్ది కాలంగా హీరో శర్వానంద్ కరియర్ లో హిట్టు లేకుండా పోయింది. "మహానుభావుడు" సినిమా తర్వాత శర్వానంద్ నటించిన అన్ని సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద చతికిలబడ్డాయి. వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న శర్వానంద్ తాజాగా "ఒకే ఒక జీవితం" అనే సినిమాలో నటించారు. ఒక సైన్స్ ఫిక్షన్ ఎమోషనల్ డ్రామా గా తెరకెక్కిన ఈ చిత్రానికి శ్రీ కార్తిక్ అనే కొత్త డైరెక్టర్ దర్శకత్వం వహించారు. ప్రముఖ నటి అమల అక్కినేని ఈ సినిమాలో శర్వానంద్ తల్లి పాత్రలో కనిపించారు. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో నడిచే ఈ కథ తల్లి కొడుకుల సెంటిమెంట్ ఆధారంగా సాగతుంది. తాజాగా సినిమాకి సంబంధించిన ఈవెంట్ లో మాట్లాడుతూ కొన్ని షాకింగ్ కామెంట్లు చేశారు శర్వా.

ఈ సినిమా షూటింగ్ సమయంలో తాను డిప్రెషన్ కి లోనయ్యానని కథ అంత ఇంటెన్స్ గా ఉండడంతో తన మనసు కలత చెందిందని చెప్పుకొచ్చారు. "ఒక షూటింగ్ షెడ్యూల్ ని పూర్తి చేసిన తర్వాత నేను అమెరికాకి వెళ్లాను. అక్కడ డాక్టర్ని కలిసాను. ఆ డాక్టర్ నన్ను ఇలాంటి సినిమాలకు దూరంగా ఉండమని చెప్పారు. కానీ ఇది నా కెరియర్లో బెస్ట్ సినిమా అని చెప్పగలను. సినిమా చాలా బాగా ఆడుతోంది. ప్రతి షోకి కలెక్షన్లు పెరుగుతున్నాయి" అని చెప్పుకొచ్చారు శర్వానంద్. రీతు వర్మ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా మంచి టాక్ తో బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతోంది.

Jyothi

Jyothi

Next Story