ప్రభాస్ నుంచి రానా ఏం నేర్చుకున్నాడో తెలుసా

ప్రభాస్ నుంచి రానా ఏం నేర్చుకున్నాడో తెలుసా
x
Highlights

జక్కన్న రాజమౌళి రూపొందించిన 'బాహుబలి' పుణ్యమా అని టాలీవుడ్ స్టార్ లు రానా దగ్గుబాటి, ప్రభాస్ ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకోవడం మాత్రమే...

జక్కన్న రాజమౌళి రూపొందించిన 'బాహుబలి' పుణ్యమా అని టాలీవుడ్ స్టార్ లు రానా దగ్గుబాటి, ప్రభాస్ ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకోవడం మాత్రమే కాక వారిద్దరు కూడా మంచి స్నేహితులు అయిపోయారు. 'బాహుబలి' షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా వారిద్దరి స్నేహం అలానే ఉంది. ఈ మధ్యనే వారిద్దరూ మరియు రాజమౌళి కలిసి 'కాఫీ విత్ కరణ్' షోలో కనిపించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రానా ప్రభాస్ నుంచి తాను నేర్చుకున్న ఒక మంచి గుణం గురించి చెప్పాడు.

"ప్రభాస్ నుంచి నేను నేర్చుకున్నది ఏమైనా ఉంది అంటే అది సహనం. ప్రభాస్ అత్యంత సహనశీలి. కేవలం ఒకే ఒక్క సినిమా (బాహుబలి) కోసం ఐదేళ్లు కేటాయించాడు అంటే అర్థమయిపోతుంది తనకి ఎంత ఓర్పు ఉందో. కావాలి అనుకుంటే ప్రభాస్ ఆ 5 ఏళ్లలో బోలెడు సినిమాలు చేసి ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించే వాడు. కానీ ఎన్ని సినిమాలు చేశాం అనేదానికంటే ఎలాంటి సినిమా చేశాం అనేదానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు ప్రభాస్" అని చెప్పుకొచ్చాడు రానా. ఇక సినిమాల పరంగా చూస్తే ప్రభాస్ 'సాహో' మరియు రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తున్న సినిమాలతో బిజీగా ఉండగా మరోవైపు రానా '1945', 'హాథి మేరే సాథి' సినిమాలతో బిజీగా ఉన్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories