Dil Raju: "నాకు అసలు డైరెక్షన్ చేయాలని లేదు," అంటున్న దిల్ రాజు

Dil Raju: "కొత్త డైరెక్టర్లను క్రియేట్ చేయటం నాకు ఇష్టం" అంటున్న దిల్ రాజు

Jyothi
Updated on: 10 March 2023 9:31 AM IST
I love Creating New Directors Says Dil Raju
X

Dil Raju: "నాకు అసలు డైరెక్షన్ చేయాలని లేదు," అంటున్న దిల్ రాజు 

Dil Raju: ఇండస్ట్రీలో ఉన్న స్టార్ నిర్మాతలలో దిల్ రాజు ఒకరు. ఒక నిర్మాతగా మాత్రమే కాక డిస్ట్రిబ్యూటర్ గా కూడా దిల్ రాజు కి రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరు ఉంది. దిల్ సినిమాతో తన కెరీర్ నీ మొదలుపెట్టిన దిల్ రాజు తన కెరియర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను నిర్మించారు. వరుసగా 6 బ్లాక్ బస్టర్ సినిమాలను అందుకొని డబల్ హ్యాట్రిక్ కొట్టిన తెలుగు నిర్మాత కూడా దిల్ రాజే. బొమ్మరిల్లు, పరుగు, కొత్త బంగారు లోకం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీం, శతమానం భవతి, నేను లోకల్, ఫిదా, రాజా ది గ్రేట్ వంటి ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలను నిర్మించి తనకంటూ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు దిల్ రాజు.

నిర్మాతగా మంచి పేరు ప్రఖ్యాతలు అందుకున్న దిల్ రాజు ఎప్పుడు డైరెక్షన్ మీద మాత్రం ఇంట్రెస్ట్ చూపించలేదు. తాజాగా దీని గురించి ఒక ఇంటర్వ్యూలో అడగగా దిల్ రాజు ఒక ఆసక్తికరమైన జవాబు ఇచ్చారు. అయితే దిల్ రాజుకి డైరెక్టర్ గా మారటం కంటే కొత్త కొత్త డైరెక్టర్లను సృష్టించడం అంటే చాలా ఇష్టమట. ఈ మాట స్వయంగా దిల్ రాజు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అన్నారు. "నాకు అసలు డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్ లేదు. నాకు కొత్త కొత్త డైరెక్టర్లను సృష్టించటం అంటే చాలా ఇష్టం.

కొత్త డైరెక్టర్లకు జీవితాన్ని ఇచ్చినప్పుడు నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. సుకుమార్ ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే టాప్ డైరెక్టర్లలో ఒకరు. వంశి పైడిపల్లి కూడా డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇలా మా ప్రొడక్షన్ బ్యానర్ తో ఎంతోమంది పెద్ద డైరెక్టర్లుగా మారారు," అని అన్నారు దిల్ రాజు. ఇక సినిమాల పరంగా చూస్తే ఈ మధ్యనే "వారసుడు" సినిమాని నిర్మించిన దిల్ రాజు తాజాగా ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమాని కూడా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story