రష్మీ అంటే గౌరవం అంటున్న సుడిగాలి సుధీర్!

రష్మీ అంటే గౌరవం అంటున్న సుడిగాలి సుధీర్!
x
Sudheer with Ali in etv ali tho saradaga (screen shot taken from etv you tube video)
Highlights

జబర్దస్త్ సుధీర్ గురించి ఎవరైనా మాట్లాడితే అందులో ఏంకర్ రష్మీ పేరు లేకుండా ఏమీ ఉండదు. అది చెబుతూనే.. రష్మీ అంతే నాకు గౌరవం అంటున్నాడు సుడిగాలి కాదు కాదు సాఫ్ట్ వేర్ సుధీర్!

సుధీర్ అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. జబర్దస్త్ సుధీర్ అంటే కొంతమంది గుర్తు పట్టొచ్చు.. సుడిగాలి సుధీర్ అంటే చాలావరకూ ఓ అతనా అనొచ్చు. సుధీర్ ముందు ఎన్ని పదాలు పెట్టినా కొందరికే తెలుస్తుంది. కానీ, అదే పేరు ముందు రష్మీ అని తగిలిస్తే బుల్లితెర ప్రేక్షకులే కాదు.. దాదాపుగా తెలుగు రాష్ట్రాల్లో అందరూ వెంటనే గుర్తు పట్టేస్తారు. ఇది అతిశయోక్తి కాదు.

ఆన్ స్క్రీన్ మీద దాదాపుగా ఏడేళ్లుగా సుధీర్-రష్మీ జంట అంత పాప్యులర్ అయింది. ఈ ఇద్దరూ కల్సి వున్నా వేదిక ఏదైనా అది సూపర్ హిట్టే! జబర్దస్త్ కావొచ్చు.. డీ జోడీ కావొచ్చు.. మరేదైనా ప్రత్యేకమైన కార్యక్రమం కావచ్చు దానిలో సుధీర్ - రష్మీ ఉన్నారంటే చాలు ప్రేక్షకులు అదోరకమైన గమ్మత్తు ఫీల్ అవుతారు.

సుడిగాలి సుధీర్ ఇప్పుడు సాఫ్ట్ వేర్ సుధీర్ అవుతున్నాడు. హీరోగా ఆ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా విడుదలకు సిద్ధం అయింది. ఈ సందర్భంగా సుధీర్ ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. ఇదిలా ఉండగా.. సుధీర్ ఈటీవీ లో ప్రసారం అవుతున్న అలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇండస్ట్రీకి సంబంధించిన వారితో ఓ గంట పాటు సీనియర్ నటుడు ఆలీ చేసే హంగామా ఆ కార్యక్రమం. అవతలి సెలబ్రిటీలను అటూ ఇటూ పెట్టి సరదా సీక్రెట్ లు బయట పెట్టె ప్రయత్నం చేస్తుంటారు ఆలీ.

ఇక ఈవారం ఎపిసోడ్ లో సుధీర్ తో ముచ్చట్లు పెట్టారు ఆలీ. ఈ సందర్భంగా సుధీర్ చిన్న నాటి సంగతుల నుంచి ఇప్పటి సంగతుల దాకా ఎన్నో విశేషాలను మాట్లాడారు. షో చివరికి వచ్చేసరికి ఆలీ ఒక సీరియస్ క్వశ్చన్ అంటూ సుధీర్ తో మాట్లాడారు. రష్మీ కీ నీకూ మధ్య ఉన్న రిలేషన్ ఏమిటని సూటిగా అడిగారు. దానికి సుధీర్ కూడా చక్కగా రెస్పాండ్ అయ్యాడు. రష్మీ గురించి మాట్లాడుతూ.. ''ఆమె తో ఏడేళ్లుగా స్నేహం ఉంది. అది స్నేహం మాత్రమే. ఆన్ స్క్రీన్ మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బావుంటుంది. అందుకే అందరూ మరోరకంగా మాట్లాడతారు. నిజానికి అటువంటిది ఏమీ లేదు'' అని చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా రష్మీ చాలా కష్ట పది ఈ స్థాయికి వచ్చిందన్నారు. ఆమె ఎంత కష్టపడిందో తెలిసిన తరువాత ఆమె పై గౌరవం రెట్టింపయింది. నాకు రష్మీ అంటే విపరీతమైన గౌరవం ఉంది అని చెప్పాడు. నా విజయానికి కారణమైన వాళ్లలో రష్మీ కూడా ఒకరు. ఎందుకంటే, ఆమె పేరుతొ ముడివేసి నాపేరు వాడడం వలెనే నేను ఇంత పాప్యులర్ అయ్యాను. అందుకే రష్మీ కి ఎప్పుడూ నా మనసులో గౌరవం ఉంటుంది అని నిజాయితీగా చెప్పాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories