Siddharth: సౌండ్ ఇంజనీరింగ్ కూడా నేర్చుకున్నాను అంటున్న సిద్ధార్థ్

Siddharth: "బొమ్మరిల్లు" సినిమాతో లవర్ బాయ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న హీరో సిద్ధార్థ్...

admin1
Updated on: 12 Oct 2021 9:00 PM IST
I have Chosen a Corporate Career Says Siddharth
X

Siddharth: సౌండ్ ఇంజనీరింగ్ కూడా నేర్చుకున్నాను అంటున్న సిద్ధార్థ్

Siddharth: "బొమ్మరిల్లు" సినిమాతో లవర్ బాయ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న హీరో సిద్ధార్థ్ చాలా మంచి సినిమాలు చేశారు కానీ గత కొంతకాలంగా సిద్ధార్థ్ తెలుగు ఇండస్ట్రీ కి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే "నవరస" అనే వెబ్ సిరీస్ తో మళ్లీ ప్రేక్షకులను పలకరించిన సిద్ధార్థ్ తెలుగులో శర్వానంద్ తో కలిసి "మహా సముద్రం" అనే మల్టీ స్టారర్ సినిమాలో నటిస్తున్నారు. "ఆర్ ఎక్స్ 100" ఫేమ్ అజయ్ భూపతి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సిద్ధార్థ్ చాలా ఇంటర్వ్యూలలో పాల్గొంటూ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవుతున్నారు.

ఇప్పటికీ నటుడిగా, రైటర్ గా, నిర్మాతగా మరియు సింగర్ గా అందరి దృష్టిని ఆకర్షించిన సిద్ధార్థ్ సౌండ్ ఇంజనీరింగ్ కూడా నేర్చుకున్నారట. "ఒకవేళ నేను ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్తో పని చేయాల్సి వస్తే వాళ్ళ పని ఏంటి వాళ్ళు మాట్లాడుకునేది ఏంటి అనేది నాకు అర్థం అవ్వాలి అని నా అభిప్రాయం. నటుడిగా నాకు మంచి రెమ్యూనరేషన్ వస్తూ ఉంటుంది. అందుకే నా క్రాఫ్ట్ పై మరింత పట్టు సాధించాలని అనుకుంటూ ఉంటాను" అని అన్నారు సిద్ధార్థ్. ఇక మంచి అంచనాల మధ్య "మహాసముద్రం" సినిమా అక్టోబర్ 14న విడుదలకు సిద్ధమవుతోంది.

admin1

admin1

Next Story