Tamannaah Bhatia: రీల్ పాత్రలతో ఫ్యాన్స్ కనెక్ట్ అయితేనే ఆనందం: తమన్నా

Tamannaah Bhatia: తమన్నా ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ఓవైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులకు కనువించు చేస్తున్నారు.

Venkata Chari
Updated on: 13 May 2021 6:00 PM IST
I find joy when fans resonate with my reel characters: Tamannaah Bhatia
X

తమన్నా (ఫొటో ట్విట్టర్)

Tamannaah Bhatia: తమన్నా భాటియా ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ఓవైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులకు కనువించు చేస్తున్నారు. తాజాగా 'నవంబర్‌ స్టోరీస్‌' తో మే 20 న హాట్‌స్టార్‌లో సందడి చేయబోతున్నారు. ఈ సందర్భంగా కొన్ని విషయాలను ఆమె మీడియాతో పంచుకున్నారు.

"నవంబర్‌ స్టోరీస్‌లో నేను ఓ ఎథికల్ హ్యాకర్ పాత్రను పొషించాను. సృజనాత్మక నైపుణ్యాలను తెలుసుకునేందుకు నాకు ఈ ప్రాజెక్ట్ చాలా ఉపయోగపడింది. ఈ పాత్రలు ప్రేక్షకులకు చేరువైతేనే నాకు ఆనందంగా ఉంటుందని" తమన్నా అన్నారు.

ఈ వెబ్ సిరీస్‌ లో తమన్నా అనురాధ అనే పాత్రను పోషిస్తుంది. "ఇప్పటివరకు తాను పోషించిన అన్ని పాత్రల్లో ఇది ప్రత్యేక మైంది. స్క్రిప్ట్, కథాంశం అలాగే రామ్ సుబ్రమణియన్ దర్శకత్వం అద్భుతంగా ఉందని" పేర్కొన్నారు.

"కొంత భాగం షూట్ చేసిన తరువాత.. మేము కొన్ని సన్నివేశాలను రీషూట్ చేశాం. ఎందుకంటే కొన్ని పాత్రల్లో ఎమోషన్స్ చాలా ప్రత్యేకమైనవి. పాత వాటితో టీం సంతృప్తి చెందలేదు. అందుకే కొన్ని సీన్లను మరలా షూట్ చేశామని" గుర్తుచేసుకుంది.

ఏడు ఎపిసోడ్లుగా రానున్న ఈ నవంబర్‌ స్టోరీస్‌ లో పసుపతి, జీఎం కుమార్, అరుల్దాస్, వివేక్ ప్రసన్న తదితరులు నటించారు. "నవంబర్ స్టోరీ" డిస్నీ + హాట్స్టార్ వీఐపీ లో మే 20 న హిందీ, తమిళం, తెలుగు భాషలలో విడుదల కానుంది.

Venkata Chari

Venkata Chari

Next Story