"నా వయసు అది కాదు" అంటున్న అనసూయ

I am 36 not 40 Reveals Anasuya Bharadwaj
x

"నా వయసు అది కాదు" అంటున్న అనసూయ

Highlights

Anasuya Bharadwaj: ఒక వైపు యాంకర్ గా మరోవైపు నటిగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అనసూయ భరద్వాజ్ ...

Anasuya Bharadwaj: ఒక వైపు యాంకర్ గా మరోవైపు నటిగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అనసూయ భరద్వాజ్ ఆసక్తికరమైన పాత్రలతో స్టార్ హీరో సినిమాలతో కెరీర్ లో ముందుకు దూసుకుపోతోంది. అయితే తాజాగా అనసూయ ఎప్పటికప్పుడు ఏదో ఒక వివాదాల్లో ఇరుక్కుంటు వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా మీడియా తన గురించి తప్పుడు ప్రచారాలు చేస్తోంది అంటూ సోషల్ మీడియా ద్వారా వాపోయింది. ఏదో ఒక న్యూస్ ఛానల్ తన గురించి మాట్లాడుతూ 40 ఏళ్ళు దాటినప్పటికీ ఇంకా చాలా హాట్ గా ఉంది అని అనగా వారిపై నిప్పులు చెరుగుతోంది అనసూయ.

"నాకు 40 ఏళ్లు లేవు. 36 ఏళ్లు మాత్రమే. వయస్సు అనేది పెరుగుతూనే ఉంటుంది. దాన్ని నేను దాచాలి అనుకోవటం లేదు. కానీ నేను అందంగానే ఉంటానని ప్రమాణం చేస్తున్నాను. మీరు మాత్రం మీ ప్రొఫెషన్ ను నిజాయితీ మరియు ఎథిక్స్ తో చేయాలి. జర్నలిజం చాలా పవర్ఫుల్. సరిగా హ్యాండిల్ చేయకపోతే మన మీద బ్యాక్ ఫైర్ అవుతుంది" అని కామెంట్లో చేసింది అనసూయ. ఇక సినిమాల పరంగా ఈ మధ్యనే "పుష్ప: ది రైజ్" సినిమాలో కనిపించిన ఈ భామ "పుష్ప: ది రూల్" లో కూడా నెగటివ్ పాత్రతో అలరించనుంది. మరోవైపు అనసూయ ఈ మధ్యనే "ఖిలాడి" సినిమాలో కూడా కనిపించింది.


Show Full Article
Print Article
Next Story
More Stories