Hari Hara Veera Mallu: ‘హరి హర వీరమల్లు’పై హైపర్‌ ఆది రివ్యూ..!

Hyper Aadi Reviews Pawan Kalyan’s Hari Hara Veera Mallu Movie
x

Hari Hara Veera Mallu: ‘హరి హర వీరమల్లు’పై హైపర్‌ ఆది రివ్యూ..!

Highlights

Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ సినిమా ఈ రోజు భారీ అంచనాల మధ్య విడుదలైంది.

Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ సినిమా ఈ రోజు భారీ అంచనాల మధ్య విడుదలైంది. ఇప్పటికే ప్రీమియర్, బెనిఫిట్ షోలను చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ కమెడియన్, 'జబర్దస్త్' ఫేమ్ హైపర్ ఆది కూడా తన స్పందనను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నాడు.

హైపర్ ఆది మాట్లాడుతూ – "పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘హరిహర వీరమల్లు’ సినిమా ప్రీమియర్ షో చూశాను. సినిమా అద్భుతంగా ఉంది. పవన్ ఎంట్రీ సీన్ అద్భుతంగా తెరకెక్కింది. ఆయన elevation సీన్స్ అభిమానులను ఉర్రూతలూగించేలా ఉన్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్ సీన్‌లో పవన్‌ కళ్యాణ్ ఎనర్జీకి, ఎంఎం కీరవాణి అందించిన నేపథ్య సంగీతానికి థియేటర్‌లో గూస్‌బంప్స్ రావడం ఖాయం. ఈ సినిమాను ప్రతి ఒక్కరూ కుటుంబసభ్యులతో కలిసి థియేటర్‌లో తప్పకుండా చూడాలి" అని సూచించాడు.

అంతేకాకుండా, "ఈ సినిమా షూటింగ్ సమయంలో నేను పలుమార్లు సెట్‌కి వెళ్లాను. పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం ఓ మంచి సినిమాను ఇవ్వాలనే ఆత్మీయతతో ప్రతి సన్నివేశంలో చాలా శ్రద్ధ తీసుకున్నారు. ఆ కృషి స్క్రీన్ మీద స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతి అభిమాని గర్వపడే సినిమా ఇది" అంటూ హైపర్ ఆది తన మద్దతును తెలియజేశాడు.


Show Full Article
Print Article
Next Story
More Stories