దర్శకుడు త్రివిక్రమ్ కారును ఆపిన ట్రాఫిక్ పోలీస్... జరిమానా విధింపు...

Trivikram Srinivas: దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు.

Arun Chilukuri
Updated on: 4 April 2022 4:45 PM IST
Hyderabad Traffic Police Fine for Trivikram Srinivas
X

దర్శకుడు త్రివిక్రమ్ కారును ఆపిన ట్రాఫిక్ పోలీస్... జరిమానా విధింపు...

Trivikram Srinivas: దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో తనిఖీల సందర్భంగా త్రివిక్రమ్ కారును ఆపిన పోలీసులు కారుకు ఉన్న బ్లాక్ ఫిల్మ్‌ను తొలగించి చలానా విధించారు. ఆ సమయంలో త్రివిక్రమ్‌ కారులోనే ఉన్నారు. కాగా, గతకొన్ని రోజులుగా బ్లాక్ ఫిల్మ్ ఉన్న కార్లకు పోలీసులు ఫైన్ వేస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, మంచు మనోజ్, కల్యాణ్ రామ్ కార్లకూ ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story