Samantha: ఎట్టకేలకు పుకార్లకు జవాబు ఇచ్చిన సమంత

Hyderabad is my Home Says Samantha
x

Samantha: ఎట్టకేలకు పుకార్లకు జవాబు ఇచ్చిన సమంత

Highlights

* నా మీద వచ్చే వందల రూమర్ల లాగానే ఇందులో కూడా ఏ మాత్రం నిజం లేదు * హైదరాబాద్ నాకు ఇల్లు లాంటిది

Samantha: టాలీవుడ్ స్టార్ కపుల్ నాగచైతన్య మరియు సమంత త్వరలో విడాకులు తీసుకోబోతున్నట్లు గా టాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. అక్కినేని కుటుంబం కానీ సమంత కానీ ఈ పుకార్లు కి రియాక్ట్ అవ్వక పోవడం తో వారి మధ్య నిజంగానే విభేదాలు వచ్చాయని అభిమానులు నిరాశ చెందారు.

కానీ తాజా సమాచారం ప్రకారం సమంత తన గురించి వస్తున్న పుకార్లకు చెక్ పెట్టారు. సమంత మొదలుపెట్టిన సాకీ అనే బట్టల బ్రాండ్ తాజాగా మొదటి వార్షికోత్సవాన్ని జరుపుకుంది. దీంతో అభిమానులతో చాట్ చేస్తూ వారు అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇచ్చింది సమంత.

ఈ నేపథ్యంలో ఒక ఫ్యాన్ మీరు నిజంగా ముంబై కి షిఫ్ట్ అవుతున్నారా అని అడగగా, సమంత ఈ విధంగా చెప్పుకొచ్చింది. "ఇలాంటి వార్తలు ఎవరు మొదలు పెట్టారో నాకు నిజంగా తెలియదు. నా మీద వచ్చే వందల రూమర్ల లాగానే ఇందులో కూడా ఏ మాత్రం నిజం లేదు. హైదరాబాద్ నాకు ఇల్లు లాంటిది.

హైదరబాద్ నాకు చాలా ఇచ్చింది. ఇకపై కూడా నేను హైదరాబాదు లోనే ఉంటాను" అని చెప్పుకొచ్చింది సమంత. డైరెక్ట్ గా తన విడాకుల పుకార్లపై రియాక్ట్ అవ్వక పోయినప్పటికీ సామ్ హైదరాబాద్ లోనే ఉంటుంది అనే వార్త అక్కినేని అభిమానులకు కొంచెం ఊరట కలిగించింది అని సమాచారం.


Show Full Article
Print Article
Next Story
More Stories