RRR Movie: రికార్డు స్థాయిలో థియేట్రికల్ బిజినెస్ చేసిన "ఆర్ ఆర్ ఆర్"

RRR Movie: రికార్డు స్థాయిలో థియేట్రికల్ బిజినెస్ చేసిన "ఆర్ ఆర్ ఆర్"

admin1
Updated on: 17 March 2022 3:30 PM IST
Huge Target for RRR Movie | Tollywood News
X

రికార్డు స్థాయిలో థియేట్రికల్ బిజినెస్ చేసిన "ఆర్ ఆర్ ఆర్"

RRR Movie: తెలుగు ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న "ఆర్ఆర్ఆర్" సినిమా మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. రం చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఈ సినిమాకి ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించారు. తాజాగా చిత్ర ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు దర్శకనిర్మాతలు. ప్రస్తుతం ఈ చిత్ర బిజినెస్ కి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. కేవలం నైజాం ప్రాంతం లోనే సినిమా బ్రేక్ పాయింట్ చేరుకోవడానికి 72 కోట్లు వసూలు చేయాల్సి ఉంది.

మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ఈ సినిమా 90 కోట్లు వరకు కలెక్షన్ లో నమోదు చేయాలి. సీడెడ్ లో 40 కోట్లు వసూలు చేయాల్సిన ఈ చిత్రం మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రెండు వందల కోట్ల దాకా కలెక్షన్లు చేయాల్సి ఉంది. తమిళనాడులో కూడా బ్రేక్ ఈవెన్ పాయింట్ 75 కోట్లు కాగా, కేరళలో 20 కోట్లు, కర్ణాటకలో 80 కోట్లు గ్రాస్ కలెక్షన్లు చేయాల్సి ఉంది. హిందీలో కూడా "ఆర్ఆర్ఆర్" హవా బాగానే నడుస్తోంది. భారీ మొత్తానికి అమ్ముడైన ఈ సినిమా ఇప్పుడు హిందీ లో 250 కోట్లు నెట్ వసూలు చేయాల్సి ఉంది. ఓవర్సీస్ లో కూడా 22 మిలియన్ డాలర్లు చేరుకుంటే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బ్లాక్బస్టర్ హిట్ అయినట్టే.

admin1

admin1

Next Story