Akhil Akkineni: అఖిల్ సినిమాలో మెగాస్టార్

Akhil Akkineni: ఏజెంట్ మూవీలో మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నారని తెలుస్తుంది.

Kranthi
Updated on: 4 July 2021 11:50 AM IST
Huge Remuneration for Mammootty Akhil Agent Movie
X

Akhil Akkineni

Akhil Akkineni: ఒక్క లుక్ తోనే అంచనాలు పెరిగిపోయాయి. ఇంతకు ముందు ఫ్లాప్ లున్నా సరే.. ఈ లుక్ ఓ రేంజ్ లో ఉండటంతో క్రేజీగా మారిపోయింది సినిమా. టేకింగ్ స్పెషలిస్ట్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అక్కినేని అఖిల్ నటిస్తున్న సినిమా ఏజెంట్. ఈ సినిమా లుక్ పోస్టరే అదరగొట్టేసింది. రఫ్ లుక్ లో అఖిల్ నిజంగా షాకిచ్చాడు. ఫంకీ స్టయిల్ లో అఖిల్ గ్లామర్ డబల్ అయింది. ఇప్పుడు ఆ సినిమాలో ఓ పెద్ద స్టార్ నటించబోతున్నాడనే వార్త హల్ చల్ చేస్తోంది.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు సినిమా పై అంచనాలను పెంచేసింది. ఈ సినిమాలో ఓ పవర్ఫుల్ రోల్ ఉందనీ .. అలాగే ఈ సినిమాలో సీనియర్ హీరో మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నారని తెలుస్తుంది. ఇప్పటికే మమ్ముటి తో చిత్ర యూనిట్ సంప్రదింపులు జరిపిందట… సినిమా చేయడానికి మమ్ముట్టి సైడ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని తెలుస్తుంది. అలాగే ఈ సినిమా కోసం ఆయన తీసుకునే పారితోషికం 3 కోట్లు అని అంటున్నారు.

మమ్ముటి తెలుగు ప్రేక్షకులు సుపరిచితులే.. అయ్యన నటించిన చాలా సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాయి. ఇటీవల దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన 'యాత్ర' సినిమాలో నటించి ఆకట్టుకున్నారు. ఇప్పుడు అఖిల్ సినిమా కోసం ఓ పవర్ ఫుల్ పాత్రలో నటించనున్నారు. ఆయన పాత్ర సినిమా సినిమాకే హైలైట్ గా ఉంటుందట.

Kranthi

Kranthi

Next Story