OTT Offers - Radhe Shyam: ఓటీటీల నుండి భారీ ఆఫర్లు అందుకుంటున్న "రాధేశ్యామ్"

OTT Offers: ఒక ప్రముఖ ఓటీటీ వారు నిర్మాతలకు సినిమా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కోసం 300 కోట్లు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.

admin1
Updated on: 3 Jan 2022 3:30 PM IST
Huge OTT Offer to Prabhas Radhe Shyam Movie | Tollywood News
X

OTT Offers - Radhe Shyam: ఓటీటీల నుండి భారీ ఆఫర్లు అందుకుంటున్న "రాధేశ్యామ్" 

OTT Offers - Radhe Shyam: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న "రాధే శ్యామ్". పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని మొదట జనవరి 14న విడుదల చేయాలని అనుకున్నారు దర్శకనిర్మాతలు. కానీ జనవరి 7న విడుదల అవుతున్న "ఆర్ఆర్ఆర్" కూడా వాయిదా పడటంతో ఇప్పుడు అందరూ "రాధే శ్యామ్" వైపు చూస్తున్నారు.

సినిమా కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మరో వైపు సినిమాకి ఓటీటీ ప్లాట్ఫామ్ నుంచి మంచి ఆదరణ లభిస్తోందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఒక ప్రముఖ ఓటీటీ వారు నిర్మాతలకు సినిమా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కోసం 300 కోట్లు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా ఏ భారతీయ సినిమాకి ఇంత భారీ ఆఫర్ రాకపోవడం విశేషం.

ఇంత పెద్ద ఆఫర్ వల్ల నిర్మాతలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు కానీ సినిమా థియేటర్లలో విడుదల చేయకపోవడం మంచిదా కాదా అని వారు ఇంకా ఆలోచించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాని నిర్మించిన యు.వి క్రియేషన్స్ వారు ఓటీటీ వారిని 350 కోట్లు అడిగారట. మరి వారు అంత భారీ మొత్తాన్ని చెల్లించి సినిమాని కొనుగోలు చేస్తారో లేదో ఇంకా తెలియాల్సి ఉంది. దీని గురించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.

admin1

admin1

Next Story