RRR Movie: "ఆర్ ఆర్ ఆర్" లో ఏకంగా 10 ఫైట్ సీన్లు పెట్టిన రాజమౌళి

RRR Movie: ప్రపంచం మొత్తం మీద రాజమౌళి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా "ఆర్ఆర్ఆర్".

admin1
Published on: 7 Aug 2021 6:40 PM IST
Huge Fight Scene in RRR Movie
X

RRR Movie: "ఆర్ ఆర్ ఆర్" లో ఏకంగా 10 ఫైట్ సీన్లు పెట్టిన రాజమౌళి

RRR Movie: ప్రపంచం మొత్తం మీద రాజమౌళి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా "ఆర్ఆర్ఆర్". అల్లూరి సీతారామ రాజు పాత్రలో రామ్ చరణ్ మరియు కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ ఈ సినిమాలో కనులవిందు చేయనున్నారు. అయితే ఈ సినిమా గురించిన ప్రతి అప్డేట్ నెట్టింట్లో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. భారీ బడ్జెట్తో తెరకెక్కనున్న ఈ సినిమా లో ఏకంగా 10 భారీ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయట. ఈ సినిమాను రాజమౌళి భారీ ఫైట్ సీక్వెన్స్ లతో నింపివేసినట్లు తెలుస్తోంది.

సినిమాలోని ప్రతి పది నిమిషాలకి ఒక ఫైట్ సీన్ వస్తుందట. అయితే ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు కూడా బోర్ కొట్టకుండా ప్రేక్షకుల ను అబ్బురపరిచే విధంగా ఉంటాయని సమాచారం. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమాలో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ మధ్య జరిగే ఒక ఫైట్ సీక్వెన్స్ ప్రేక్షకులకు కన్నీళ్లు పెట్టిస్తుందని విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే రివీల్ చేశారు. ప్రస్తుతం "ఆర్ ఆర్ ఆర్" షూటింగ్ ఉక్రెయిన్ లో జరుగుతోంది. అక్టోబర్ 13న ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ మరియు మలయాళం భాషల్లో భారీ గా విడుదల కానుంది. ఈ సినిమాలో అలియా భట్ మరియు ఒలీవా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

admin1

admin1

Next Story